Begin typing your search above and press return to search.

కొత్త కొత్త ప్రయత్నాలు.. ఎందుకిలా!!

By:  Tupaki Desk   |   28 March 2017 5:11 AM GMT
కొత్త కొత్త ప్రయత్నాలు.. ఎందుకిలా!!
X
ఇప్పుడు చాలామంది సినిమా వాళ్ళు కూడా వెబ్ సిరీస్ లై పడ్డారు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ టాలెంట్ చూపించేద్దాం అనే ఉద్దేశ్యంతో వీరందరూ ఈ వెబ్ మీడియాను వాడుకోవాలని చూస్తున్నారులే. అయితే వాటిని కూడా మనోళ్లు సినిమా టైపులోనే సినిమా కథలనే తీస్తుంటే మాత్రం.. కాస్త కామెడీగానే ఉంది.

కుర్ర హీరో సుమంత్ అశ్విన్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ ల జాబితాలో జాయిన్ అయ్యాడు. తన అసోసియేట్ పేరు వేస్తూ తానే దాదాపుగా డైరక్ట్ చేసేశాడు దేవ కట్టా. ఈ వెబ్ సిరీస్ పేరు ''ఎందుకిలా?''. పుట్టినప్పటినుండీ బ్యాడ్ లక్ నే ఇంటిపేరుగా చేసుకున్న ఒక యువకుడి కథ ఈ సినిమా. ఇలాంటివి మనం అనేకం చూశాం కదూ. కాకపోతే సుమంత్ అశ్విన్ ఏరి కోరి ఈ వెబ్ సిరీస్ ఎందుకు చేశాడో ఎవ్వరికీ అర్ధంకావట్లేదు.

బాలీవుడ్ వెబ్ సిరీస్ స్పేసులో ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తుంటే.. టాలీవుడ్లో మాత్రం ఇంకా అవుడ్డేటెడ్ మొగుడు పెళ్లాల కొట్లాటలూ.. హీరో హీరోయిన్ బ్యాడ్ లక్.. మందు పార్టీలు.. ఇవే తీస్తున్నారు. చూద్దాం మరి.. సినిమాల్లో హిట్లు లేని సుమంత్ ఇక్కడ ఎంతవరకు విజయవంతుడు అవుతాడో!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/