Begin typing your search above and press return to search.
కూతురు పెళ్లి వార్తల పై స్పందించిన హీరో !
By: Tupaki Desk | 12 May 2023 11:14 PM ISTతెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో చాలా మంది హీరోలు స్టార్లుగా హవాను చూపించారు. అందులో సీనియర్ హీరో సుమన్ ఒకరు. 1980, 90 దశకాల్లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సొంతం చేసుకున్నారు. ఒక్క తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని దాదాపుగా అన్ని భాషల్లోనూ సుమన్ తనదైన చిత్రాలతో ఫిదా చేసేశారు.
అప్పుడు హీరోగా సందడి చేసిన సుమన్.. కొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటికీ తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఈ సీనియర్ హీరో రాజకీయాల వైపు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వచ్చాయి.
దాదాపు నలభై ఏళ్లకు పైగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న సుమన్.. త్వరలోనే సౌత్ ఇండియాలోని ఓ స్టార్ హీరో ఫ్యామిలీతో వియ్యం అందుకోబోతున్నారని ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇందులో భాగంగానే ఆయన కుమార్తెను సదరు హీరో ఫ్యామిలీకి కోడలిని చేసే ప్రయత్నాలను చేస్తున్నారని అంటున్నారు.
తన కూతురి వివాహం గురించి వస్తున్న వార్తలపై సీనియర్ హీరో సుమన్ తాజాగా స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. 'మా అమ్మాయి అఖిలజ ప్రత్యూష హ్యూమన్ జెనెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. తను ఇంకా చదువును కొనసాగిస్తోంది. అయితే, ఈ మధ్య మా పాప పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు' అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత సుమన్ కొనసాగిస్తూ.. 'మా అమ్మాయికి పెళ్లి చేసే ఆలోచన అయితే ఉంది. కానీ, తన చదువు మొత్తం పూర్తైన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటాము. ఓ స్టార్ హీరో కొడుకుకు తనను ఇచ్చి పెళ్లి చేస్తున్నామని వస్తున్న వార్తలను నేను కూడా చూశాను. ఇది పూర్తిగా అవాస్తవం' అని సుమన్ తెలిపారు. ఇలా తన కూతురి పెళ్లిపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.