Begin typing your search above and press return to search.

ఈసారి పక్కాగా ప్లాన్‌ చేసిన సుమ రాజీవ్‌

By:  Tupaki Desk   |   6 April 2022 3:30 AM GMT
ఈసారి పక్కాగా ప్లాన్‌ చేసిన సుమ రాజీవ్‌
X
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్ ఎంతటి పాపులారిటీని దక్కించుకున్నారో కాస్త అటు ఇటుగా యాంకర్ సుమ కూడా ఆ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కేరళకు చెందిన సుమ బుల్లి తెరపై సందడి చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు సినిమా పరిశ్రమ మరియు బుల్లి తెరను అనుసంధానం చేస్తూ తనదైన శైలిలో దూసుకు వెళ్తున్నారు.

ఇప్పుడు సుమ ప్రథాన పాత్రలో జయమ్మ పంచాయతి అనే సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జయమ్మ పంచాయితి కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన సినిమా తో పాటు కొడుకు సినిమాను కూడా సుమ లైన్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. సుమ మరియు రాజీవ్‌ లు చాలా ప్లాన్ తో తనయుడు రోషన్ ను సినిమా ల్లోకి తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

కొన్నాళ్ల క్రితం రోషన్ హీరోగా ఒక సినిమా ప్రారంభించారు.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాని ఏదో కారణం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఒక మంచి స్క్రిప్ట్‌ తో పక్కా ప్లానింగ్‌ తో సుమ తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్‌ చేశారు. టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కథను అందిస్తున్నాడు. విభిన్నమైన కథలు రాయడం లో ప్రశాంత్‌ ది ఖచ్చితంగా ఒక శైలి అనడంలో సందేహం లేదు.

ప్రశాంత్‌ వర్మ ఇచ్చిన కథను విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న విరించి వర్మ దర్శకత్వంలో రోషన్ హీరోగా సినిమాను చేయబోతున్నారట. ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ రోషన్‌ విషయంలో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం అయినా కూడా ఆ సమయం ను వృదా చేయకుండా రోషన్ నటన మరియు ఇతర అంశాల మీద దృష్టి పెట్టి ప్రావిణ్యం సాధించాడని తెలుస్తోంది.

దర్శకుడు విరించి వర్మ అతి త్వరలోనే రోషన్‌ తో సినిమాను మొదలు పెట్టడం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. సుమ తనయుడు కనుక ఖచ్చితంగా రోషన్‌ కు మంచి ఎంట్రీ దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిందల్లా ఆయన్ను మంచి కథతో లాంచ్ చేయాలి.. ఆ తర్వాత కూడా రెండు మూడు మంచి సినిమాలు ఆయనకు పడాలి.

అప్పుడు ఖచ్చితంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సుమ మరియు రాజీవ్‌ లు సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉండటం తో పాటు ఎంతో మంది ఇండస్ట్రీకి పంపించిన ఘనత ఉన్న కుటుంబం నుండి వచ్చిన వారు కనుక రోషన్‌ కు ఖచ్చితంగా మంచి లైఫ్‌ ను వారు సెటిల్‌ చేస్తారు అంటూ అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.