Begin typing your search above and press return to search.

కృతిని ఏడిపించేద్దాం .. మంచి ప్రోమో వస్తుంది: సుమ

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:24 AM GMT
కృతిని ఏడిపించేద్దాం .. మంచి ప్రోమో వస్తుంది: సుమ
X
నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందింది. పొలిటికల్ టచ్ తో కూడిన మాస్ యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కృతి శెట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఈ రోజునే ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగానే జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీమ్ ను సుమ ఇంటర్వ్యూ చేసింది. నితిన్ .. కృతి .. బ్రహ్మాజీతో పాటు దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నాడు.

నితిన్ మాట్లాడుతూ .. "సాధారణంగా మనం ఎవరినైనా పెద్దయిన తరువాత ఏం కావాలనుకుంటున్నావురా అవి అడుగుతూ ఉంటాము. అలాగే నన్ను అడిగినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ను అవుతానని చెప్పేవాడిని. ఆ తరువాత నేను పెరుగుతూ ఉంటే నా మార్కులు తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి.

ఆ తరువాత హీరోగా ఇండస్ట్రీకి రావడం జరిగింది.చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ కాలేకపోయాను .. ఈ సినిమాలో ఆ పాత్రను పోషించి నా ముచ్చటను తీర్చుకున్నాను" అన్నాడు. కృతి మాత్రం తాను సైకాలజీ చదువుతున్నట్టుగా చెప్పింది.

'మీరు ఎంతవరకూ చదివారు .. ఏం చదివారు సార్?' అని బ్రహ్మాజీని సుమ అడిగితే, 'ఏం చదువుకోలేదని అడగండి' అంటూ కొన్ని ఫారిన్ యూనివర్సిటీల పేర్లను చెప్పేసి ఆయన నవ్వేశారు. ఏ సినిమాలో చూసినా హీరోయిన్ బుడగలు ఊదుతూ ఎంట్రీ ఇస్తుంది .. లేదంటే చిచ్చు బుడ్లు కాలుతుంటే అక్కడే గెంతులు వేస్తూ ఉండేలా చూపిస్తూ ఉంటారెందుకు? అంటూ ఈ సినిమా ట్రైలర్ చూపిస్తూ సుమ దర్శకుడిని అడిగింది. సాంగ్ కి ముందు వచ్చే ఆ షాట్ శేఖర్ మాస్టర్ గారి ఆలోచన అని ఆయన చెప్పాడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ ను స్వీట్ గాను .. మరో హీరోయిన్ ను హాట్ గాను చూపించడం జరిగిందని అన్నాడు.

ఈ సినిమాలో వెన్నెల కిశోర్ కి విపరీతమైన ఈగో ఉంటుంది. మీ 'ఈగో' సంగతేంటని సుమ అడిగితే రాజశేఖర్ రెడ్డి స్పందించాడు. "ఒక ఎడిటర్ గా నాకు ఒక పరిధి ఉంటుంది అక్కడ ఈగో చెల్లుతుంది .. కానీ ఒక దర్శకుడికి పదిమందితో పని ఉంటుంది .. ఇక్కడ ఈగో వర్కౌట్ కాదు. ఇక్కడ డైరెక్టర్ సీట్లో ఉన్నప్పుడు నా ద్వారా ఎవరు హర్ట్ అయినా మళ్లీ నేనే బ్రతిమాలుకోవాలి.

అందువల్లనే సైలెంట్ గా ఉండటమే బెటర్ అనుకుంటాను. ఏదో ఒక మాట అనేసి కృతి ఈగో దెబ్బతినేలా చేసి ఆమె ఏడ్చేలా చేస్తే ప్రోమో వేసుకోవచ్చనీ .. మంచి మైలేజ్ వస్తుందని సుమ అనడం ఈ ఎపిసోడ్ కి హైలైట్. సరదాగా .. సందడిగా సాగే ఈ ఎపిసోడ్ వలన ఈ సినిమాకి మంచి మైలేజ్ పెరిగే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.