Begin typing your search above and press return to search.
రాజీవ్ బర్త్ డే : సుమ విషెస్ లో ఎంత ప్రేముందో చూశారా..
By: Tupaki Desk | 13 Nov 2020 5:20 PM ISTసుమ కనకాల..తెలుగు రాష్ట్రాల్లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాంకరింగ్ లో ఆమెకి ఆమె సాటి. టీవీ షోలు, యాంకరింగ్ ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఆమె స్టేజ్ ఎక్కిందంటే మామూలుగా ఉండదు. అదరగొడుతుంది అంతే. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకి సంబంధించి కానీ, ఇతర పెద్ద కార్యక్రమాలకు కానీ యాంకరింగ్ చేయాల్సి వస్తే సుమ పేరు తప్ప వేరే ఛాయిస్ లేదు. హీరోలు కూడా ఆమెను అభిమానిస్తున్నారు. తెలుగునాట ప్రతి ఇంటా సుమకు అభిమానులున్నారు. ఓ విధంగా సుమ బుల్లితెరను ఏలేస్తోంది.
దర్శకుడు దేవదాస్ కనకాల కుమారుడు రాజీవ్ కనకాలను సుమ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నేడు రాజీవ్ కనకాల బర్త్ డే . ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ, అభిమానుల నుంచి రాజీవ్ కనకాలకు శుభాకాంక్షలు అందుతున్నాయి. తన భర్త రాజీవ్ కు సుమ ఈ సందర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుమ రాజీవ్ ని ప్రేమగా రాజా అని పిలుస్తుంటుంది. ‘నా ప్రియమైన రాజాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు నా బలం. నా హ్యపీనెస్. నీతో జీవితాన్ని పంచుకున్నందుకు సంతోషం గా ఉంది. నీతో ఉండే ప్రతి రోజూ కొత్తగా ఉండాలని ఎదురు చూస్తున్నాను. లవ్ యూ.’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సుమ తన భర్తకు చెప్పిన విషెస్ అందరినీ ఆకట్టుకుంటోంది. కేరళ కుట్టి అయిన సుమ రాజీవ్ కనకాల ను 1999లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కొడుకు రోషన్, కూతురు మనస్వీని ఉన్నారు. సోషల్ మీడియాలో వార్తలు గమనిస్తే ఎప్పుడు సుమ, రాజీవ్ కనకాల మధ్య ఏదో వివాదం జరుగుతోందని, ఇద్దరు విడి పోతున్నారని వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ మెసేజ్ తో సుమ తన భర్త పై ఎంత ప్రేమ ఉందో చాటుతూ విమర్శకుల నోళ్లు మూయించింది.