Begin typing your search above and press return to search.

ఓపెనింగ్ నుండి బ్రాండింగ్.. దటీజ్ సుమ

By:  Tupaki Desk   |   15 March 2017 11:41 AM IST
ఓపెనింగ్ నుండి బ్రాండింగ్.. దటీజ్ సుమ
X
తెలుగు టెలివిజన్ కి టాప్ యాంకర్ సుమ అనడంలో సందేహం అక్కర్లేదు. యాంకరింగ్.. గేమ్ షోస్ నిర్వహణ.. సినిమా ఫంక్షన్లకు హోస్ట్ చేయడంలో సుమకు సాటిరాగల వాళ్లు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అందుకే ఈమెకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పుడు యాంకరింగ్ తో పాటు ఇతర రంగాలలో కూడా సత్తా చాటేస్తోంది ఈ టాప్ యాంకర్.

తాజాగా విన్నర్ మూవీలో 'సూయా సూయా' అంటూ సాగే ఐటెం సాంగ్ ను పాడేసి.. సింగర్ గా కూడా ట్యాలెంట్ చూపించేసింది సుమ. యాంకరింగ్ తో పాటు తనలో చాలానే ట్యాలెంట్స్ ఉన్నాయని చెప్పకనే చెప్పింది. కొన్ని రోజుల క్రితం ఓ షాప్ ఓపెనింగ్ కి సుమను ఆహ్వానించడం హాట్ టాపిక్ అయింది. ఓ స్పా అయినింగ్ అయినా.. సుమ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ సంఘటన చాటి చెప్పింది. ఇప్పుడు ఓ బ్రాండ్ కు ప్రచారకర్తగా సుమకు అవకాశం వచ్చింది.

BRP పైప్స్ అండ్ ఫిటింగ్స్ కు.. సుమను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నారు. ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. త్వరలో ఈమెపై యాడ్స్ చిత్రీకరించి టెలికాస్ట్ చేయనున్నారు కూడా. ఈ యాడ్ కి జనాల్లో మంచి స్పందన వచ్చిందంటే మాత్రం.. బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సుమ ఫుల్లు బిజీ అయిపోవడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/