Begin typing your search above and press return to search.

బాహుబలికి సుల్తాన్ టెండర్ పెట్టేశాడా?

By:  Tupaki Desk   |   6 July 2016 5:25 PM GMT
బాహుబలికి సుల్తాన్ టెండర్ పెట్టేశాడా?
X
గతేడాది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మూవీ భజరంగీ భాయ్ జాన్ కి.. టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన బాహుబలికి మధ్య ఆసక్తికరమైన పోటీ నడించింది. రెండు భారీ రిలీజ్ లు కావడంతో.. ఇండస్ట్రీ కూడా జాగ్రత్తగా పరిశీలించింది. లోకల్ గా బాహుబలి కుమ్మేస్తే.. ఇంటర్నేషనల్ గా సల్మాన్ మూవీకి భారీగా డబ్బులొచ్చాయి. దీంతో ఫైనల్ ట్యాలీలో రెండూ సమానంగా నిలిచాయి. ఇప్పుడు సుల్తాన్ ని ఎంత భారీగా రిలీజ్ చేశారో గమనిస్తే.. బాహుబలి రికార్డులకు టెండర్ పెట్టాడనే విషయం అర్ధమవుతుంది.

దేశవ్యాప్తంగా 4,350 స్క్రీన్లలో విడుదలైన సుల్తాన్ మూవీ.. ఇంటర్నేషనల్ గా 1100స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. అంటే మొత్తం ఈ మూవీ స్క్రీన్ కౌంట్ 5,450 అన్నమాట. ఏ ఇండియన్ మూవీకయినా సరే ఇదే పెద్ద రికార్డు. ఇప్పటికే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. పైగా బుధవారమే రిలీజ్ అవడంతో.. ఐదు రోజుల పాటు కలెక్షన్స్ కుమ్మేసుకునే అవకాశం ఉంది. ఆదివారం వరకూ భారీ మొత్తంలో వసూళ్లు ఖాయం. బాహుబలి తొలిరోజు వసూళ్ల రికార్డును మినహాయిస్తే.. మిగిలిన అన్ని రికార్డులను సుల్తాన్ టార్గెట్ చేసే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.

భజరంగీ భాయ్ జాన్ తో మొదటిసారిగా 500+ కోట్ల కలెక్షన్స్ ను సల్లూ భాయ్ అందుకోగా.. మళ్లీ సుల్తాన్ తో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పుడున్న టాక్ ను గమనిస్తే.. ఇదేమీ కష్టం అనిపించడం లేదు.