Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బాబుతో సుక్కు ఉప్పు ఆటలు

By:  Tupaki Desk   |   15 Nov 2018 1:08 AM IST
ఫోటో స్టొరీ: బాబుతో సుక్కు ఉప్పు ఆటలు
X
సుకుమార్ కు ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని పేరు. అయన సినిమాలు అర్థం కావాలంటే కనీసం డిగ్రీ చదివి ఉండాలని నెటిజనులు పేల్చే జోకులకు కొదవేమీ లేదు. అయినా 'రంగస్థలం' లాంటి అందరికీ అర్థం అయ్యే సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా చరణ్ ఓ బ్రిలియంట్ పెర్ఫార్మర్ అని అందరిచేత అనిపించేలా చేశాడు.

సుక్కు పనిలో పడితే ఇక పనే లోకంగా ఉంటాడని అందరికీ తెలిసిందే. సుక్కు నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉంది. దీంతో ఈ గ్యాప్ లో ఫుల్లుగా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈమధ్య ఫ్యామిలీ తో గడుపుతూ రిలాక్స్ అవుతున్నాడు. రీసెంట్ గా సుకుమార్ తన ఫ్యామిలీ తో గడుపుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఒక ఫోటోలో సుకుమార్ తన కొడుకును వీపున ఉప్పెక్కించుకొని నడుస్తూ ఉన్నాడు. ఈ ఫోటో చూస్తే సుక్కు తను డైరెక్టర్ అనే విషయం పూర్తిగా మర్చిపోయి నాన్నలాగా మారిపోయి కొడుకుతో ఆడుకుంటున్నాడు. మరి నాన్న ప్రేమ అలానే ఉంటుంది కదా?

ఒకవైపు ఫ్యామిలీతో గడుపుతూనే మహేష్ తో చేయబోయే నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేయడం.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించనున్న సినిమాల వ్యవహారాలు కూడా చక్కబెడుతున్నాడట. ఇంకా మహేష్ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఫైనలైజ్ కాలేదట.