Begin typing your search above and press return to search.
సుకుమార్ స్టైల్ లో బాహుబలి
By: Tupaki Desk | 25 March 2018 5:54 PM ISTఈ ఊహే బాగుంది కదా. టిపికల్ సబ్జెక్ట్స్ డీల్ చేయటంలో ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ప్రభాస్ ని హ్యాండిల్ చేస్తే చూడాలని ఫాన్స్ కి మాత్రం ఉండదా ఏంటి. సుక్కు మనసులో కూడా సరిగ్గా ఇదే కోరిక ఉంది. తనకు ప్రభాస్ తో చేయాలనుందనే కాంక్షను వెలిబుచ్చాడు. ప్రస్తుతం అందరి చూపు రంగస్థలం మీద ఉండటంతో సుక్కు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. ఈ ఏడాది సాలిడ్ గా సూపర్ హిట్ అనిపించుకున్న పక్కా మాస్ సినిమా ఏది రాలేదు. అది దీంతో నెరవేరుతుందని మెగా ఫాన్స్ మాత్రమే కాదు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా బలంగా నమ్ముతున్నారు. ప్రభాస్ తో సినిమా తన టార్గెట్ లో ఉందన్న సుకుమార్ ఎలాంటి కథతో ప్రభాస్ ను ఒప్పిస్తాడో మాత్రం చెప్పలేదు. కెరీర్ లో అల్లు అర్జున్ - మహేష్ బాబు - జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేసిన సుకుమార్ 1 నేనొక్కడినే విషయంలో మాత్రమే లెక్క తప్పాడు.
పనిలో పనిగా మల్టీ స్టారర్ చేయటం కూడా గురించి ఆసక్తి చూపుతున్నాడు సుకుమార్. ఈ మధ్య టాలీవుడ్ మల్టీ స్టారర్ల జోరు ఊపందుకుంది. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబో సెట్ అవ్వడం చూసాక ముందు ముందు సంచలనాత్మక కాంబినేషన్లు సెట్ అవుతాయన్న అంచనాలో ఉన్నాయి పరిశ్రమ వర్గాలు. సుకుమార్ అడగాలే కాని వద్దనే వారు ఉండరు కాని అందుకు తగ్గ బలమైన కథ అయితే సెట్ చేసుకోవలసిందే. రంగస్థలం హిట్ అయితే సుకుమార్ లోని మరో కోణం విజయవంతంగా ఆవిష్కృతమైనట్టే .ఇప్పటి దాకా మెదడుకు పదును పెట్టే సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరున్న సుకుమార్ దీంతో ఆ మార్క్ చేరుపుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి ఖాళీగా లేడు. సాహోతో పాటు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ మూవీ మొదలు పెట్టాల్సి ఉంది. సో మరో ఏడాదిపైగానే సుకుమార్ దొరకటం కష్టం. మరి ప్రభాస్-సుకుమార్ కాంబో ఆ తర్వాతైనా సెట్ కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.