Begin typing your search above and press return to search.
ప్చ్.. సుక్కు సినిమా ఓపెనింగ్ కాలేదే!
By: Tupaki Desk | 12 May 2019 5:41 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టాడు. వాటిలో ఒకటి సుకుమార్ చిత్రం కాగా మరొకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కే మరో చిత్రం. వీటిలో సుకుమార్ చిత్రం ఓపెనింగ్ గురించి ఈమధ్య టాలీవుడ్లో వార్తలు కూడా వినిపించాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ఒక కొలిక్కి వచ్చిందని.. మే 11 న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేస్తారని అన్నారు. కానీ మే 11 కాదు 12 కూడా అయిపోతోంది. కొబ్బరికాయ మాత్రం కొట్టలేదు. సినిమా ప్రారంభం అనుకున్న మే 11 వ తేదీన బన్నీ తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్ళాడట. దాదాపు రెండు వారాల పాటు ఈ ఫారెన్ ట్రిప్ ఉంటుందని సమాచారం. ఆంటే.. ఈ లెక్కన సుక్కు సినిమా లాంచ్ కు సంబంధించి వచ్చిన వార్తలు రూమర్లని తేలిపోయినట్టే.
అయితే ఈ వార్తలతో సంబంధం లేకుండా సుకుమార్ మాత్రం స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో ఉన్నాడట. చరణ్ తో తెరకెక్కించిన తన లాస్ట్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి అంచనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే దిశగా ఒక పవర్ ఫుల్ ఫిలిం తో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడట. దాంతో పాటు స్క్రిప్ట్ కు తగ్గట్టుగా షూటింగ్ జరపడానికి వీలుగా లొకేషన్ల వేట సాగుతోందట.