Begin typing your search above and press return to search.

సుకుమార్‌ చాలా కష్టడుతున్నాడట!

By:  Tupaki Desk   |   2 Dec 2018 9:00 PM IST
సుకుమార్‌ చాలా కష్టడుతున్నాడట!
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం సమ్మర్‌ లో విడుదల అవ్వడం ఖాయం అయ్యింది. ఇక మహర్షి విడుదలకు ముందే మహేష్‌ బాబు 26వ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే మహేష్‌ 26వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో ఫిక్స్‌ అయిన విషయం తెల్సిందే. మైత్రి మూవీస్‌ వారు ఈ చిత్రంను నిర్మించేందుకు కాసుకు కూర్చున్నారు.

ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ చిత్రం షూటింగ్‌ డిసెంబర్‌ లోనే ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని సుకుమార్‌ కథ ఫైనల్‌ చేయక పోవడం వల్ల ఆలస్యం అవుతోంది. మొదట మహేష్‌ కోసం ఒక పీరియాడిక్‌ కథను సుకుమార్‌ రెడీ చేశాడట. కాని వరుసగా పీరియాడిక్‌ సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న కారణంగా మరో కథతో సినిమా చేద్దామని సుకుమార్‌ కు మహేష్‌ సూచించాడట. దాంతో సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌ కోసం ది బెస్ట్‌ కథను రాసే ప్రయత్నాల్లో ఉన్నాడు.

సుకుమార్‌ కెరీర్‌ లో ఎప్పుడు లేని విధంగా ఒక మూవీ కథ కోసం ఇంతగా కష్టపడుతున్నాడట. రంగస్థలం వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత సుకుమార్‌ పై బాధ్యత మరింతగా పెరింగింది. అందుకే మహేష్‌ బాబు కోసం ది బెస్ట్‌ కథను రెడీ చేయాలని సుకుమార్‌ పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం కాస్త సమయం ఎక్కువ అయినా కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాడు. ఇక సినిమాను కూడా హడావుడిగా కాకుండా మెల్లగానే తీసి 2020లో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. సుకుమార్‌, మహేష్‌ ల కాంబినేషన్‌ లో వచ్చిన ‘1’ చిత్రం నిరాశ మిగిల్చిన విషయం తెల్సిందే. అందుకే ఈసారి చాలా కష్టపడుతున్నాడు సుకుమార్‌. మరి కష్టంకు ఫలితం దక్కేనో చూడాలి.