Begin typing your search above and press return to search.

ఆ బాధ్యత తీసుకున్న సుక్కు

By:  Tupaki Desk   |   17 Sept 2018 10:45 AM IST
ఆ బాధ్యత తీసుకున్న సుక్కు
X
సినిమా ఇండస్ట్రీ లో హీరోగా ఎక్కువకాలం కొనసాగాలి అంటే హిట్స్ చాలా ముఖ్యం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హిట్స్ లేకపొతే కొంతకాలానికి నిర్మాతలు కూడా ముందుకు రారు. ఇక మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో స్టార్ట్ లో కాస్త తడబడ్డా వెంటనే వరస హిట్స్ తో మిడ్ రేంజ్ లో స్టార్ అనే స్థాయి కి చేరాడు. ఇక మెగా ఫ్యామిలీ నుండి మరో స్టార్ వచ్చాడు అని జనాలు అనుకునేంతలో అరడజను ఫ్లాపులతో అందరినీ నిరాశపరిచాడు.

తేజు కొత్త సినిమా ఆగష్టు లోనే ప్రారంభం కావలిసి ఉన్నప్పటికీ దాన్ని వాయిదా వేసి రెండు నెలలు బ్రేక్ తీసుకున్నాడు. ఫ్లాపులతో పాటు తేజు చబ్బీ లుక్ పై కూడా విమర్శలు రావడంతో అమెరికాకు వెళ్ళి అక్కడ ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్నాడని టాక్ వచ్చింది. నెక్స్ట్ సినిమా మొదలయ్యే లోపు ఫిట్ గా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇక తాజా సమాచారం ప్రకారం తేజు కెరీర్ ను గాడిలో పెట్టేందుకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ రంగంలోకి దిగాడట.

తేజు నెక్స్ట్ సినిమాను సుకుమార్ రైటింగ్ బ్యానర్ పై నిర్మించడమే కాకుండా ఆ సినిమాకు సుకుమార్ కథ కూడా అందిస్తాడట. ఈ సినిమాకు 'భం భోలేనాథ్' సినిమా దర్శకుడు కార్తిక్ వర్మ దర్శకత్వం వహిస్తాడట. త్వరలో ఈ సినిమాను లాంచ్ చేస్తారని సమాచారం. సుకుమార్ బ్యానర్ లో తెరకెక్కే సినిమాతో అయినా తేజు మళ్ళీ విజయాల బాట పడతాడేమో వేచి చూడాలి.