Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ అయిపోయాడు.. సుక్కు వచ్చాడు

By:  Tupaki Desk   |   4 Oct 2016 3:00 PM IST
త్రివిక్రమ్ అయిపోయాడు.. సుక్కు వచ్చాడు
X
కమెడియన్లందరూ హీరోలైపోతున్న కాలం ఇది. శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ‘గీతాంజలి’లో హీరో కాని హీరో పాత్ర చేశాడు. ఇప్పుడు ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో పూర్తి స్థాయి హీరో అవుతున్నాడు. కొన్ని నెలల కిందట ఈ సినిమా మోషన్ పోస్టర్‌ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేశాడు. దానికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ మధ్యే మళ్లీ వినాయక నిమజ్జనం సందర్బంగా ఓ ఆసక్తికర పోస్టర్‌ తో మళ్లీ జనాల్ని పలకరించాడు శ్రీనివాసరెడ్డి. నవంబర్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తుండటంతో ఇక తరచుగా సినిమాను వార్తల్లో నిలబెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం బుధవారం ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు.

మోషన్ పోస్టర్ కోసం త్రివిక్రమ్ సాయం తీసుకున్న శ్రీనివాసరెడ్డి.. ఈసారి మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్ ను తీసుకొస్తున్నాడు. సుక్కునే రేపు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టీజర్ రిలీజ్ చేయబోతున్నాడు. మరి ఆడియో వేడుక కోసం శ్రీనివాసరెడ్డి ఇంకే స్టార్ డైరెక్టర్ని పట్టుకొస్తాడో చూడాలి. పూర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శివరాజ్ కనుమూరి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే కావడం విశేషం. ఓ అబ్బాయి-అమ్మాయి కలిసి కరీంనగర్ నుంచి కాకినాడకు ప్రయాణం చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరి మధ్య ఎలాంటి బంధం ఏర్పడిందో ఇందులో చూపించబోతున్నారు. మంచి ఎంటర్టైనర్ లాగా సాగే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందంటున్నాడు శ్రీనివాసరెడ్డి. చూద్దాం.. జయమ్ము నిశ్చయమ్మురా అని ధీమాగా ఉన్న ఈ కమెడియన్ టర్న్డ్ హీరో ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/