Begin typing your search above and press return to search.

#AA20: కేరళలో జరిగిన షూటింగ్.. అది సంగతి!

By:  Tupaki Desk   |   22 Dec 2019 2:36 PM IST
#AA20: కేరళలో జరిగిన షూటింగ్.. అది సంగతి!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ ఫిలిం మేకర్ సుకుమార్ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో తప్పనిసరిగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించబోయే సినిమా కావడంతో #AA20 గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'అల వైకుంఠపురములో' తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదేనని తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిందనే వార్తలు వచ్చాయి.. నిజమేనా?

నిజానికి #AA20 రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా 'అల వైకుంఠపురములో' రిలీజ్ తర్వాతే పట్టాలెక్కుతుంది. అయితే అంతలోపు సుకుమార్ టెస్ట్ షూట్ చేస్తున్నారట. ఈ సినిమా శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని తెలుసు కదా.. అందుకే అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరపాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి.. విజువల్స్ ఎలా ఉండాలి అనేది ముందే పక్కాగా తెలుసుకునెందుకు సుకుమార్ ఇలా టెస్ట్ షూట్ ప్లాన్ చేశారట. ఈ సినిమా కోసం ఇప్పటికే చిత్తూరు యాసలో మాట్లాడేవిధంగా నటులకు ట్రెయినింగ్ ఇచ్చారట. వారిని తీసుకుని కేరళకు వెళ్లి అక్కడ టెస్ట్ షూట్ జరుపుతున్నారట. ఇది కొన్ని రోజులు కొనసాగుతుందట.

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్ పూర్తి చేసి రిలీజ్ హడావుడి తగ్గిన తర్వాత బ్యాంకాక్ షెడ్యూల్ మొదలు పెడతారాట. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు గా ఫైట్స్ కూడా చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరోయిన్ రష్మిక కూడా పాల్గొంటుందట.