Begin typing your search above and press return to search.

సుక్కు బాలీవుడ్ హీరో అతనే!

By:  Tupaki Desk   |   9 July 2018 11:41 AM IST
సుక్కు బాలీవుడ్ హీరో అతనే!
X
పట్టుమని నెల రోజులు సినిమాలు ఆడటం గగనమైన పరిస్థితుల్లో రంగస్థలంని ఏకంగా 15 సెంటర్లలో వంద రోజులు ఆడించే బొమ్మ ఇచ్చాడంటే సుకుమార్ పనితనం గురించి చెప్పేదేముంది. ఎప్పుడు లెక్కల మాస్టర్ తరహాలో సామాన్య ప్రేక్షకులకు అర్థం కానీ రీతిలో క్లిష్టమైన స్క్రీన్ ప్లే కథలు తీసే సుకుమార్ మొదటి సారి తన సహజ శైలికి భిన్నంగా కొత్తగా అలోచించి తీసిన రంగస్థలం ఏకంగా చరిత్ర సృష్టించింది. మాలాగా ఆలోచిస్తే అతనితో పోటీ పడటం కష్టం అంటూ రాజమౌళి అప్పుడెప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్ ని వసూళ్ల సాక్షిగా అక్షరాలా నిరూపించేసాడు సుకుమార్. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ గా మిగిలిపోవడం కూడా సుక్కు ఘనతే. ఇక త్వరలో మహేష్ బాబుతో రెండో సినిమా చేయనున్న సుకుమార్ దానికి ఇంకా చాలా టైం ఉన్న నేపధ్యంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఇది సుకుమార్ బయటపెట్టకపోయినా టాక్ మాత్రం జోరుగా ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు సుకుమార్ డెబ్యూ హిందీ మూవీలో హీరో వరుణ్ ధావన్ ఉండొచ్చట. ఇప్పటికే ఒక దశ చర్చలు జరిగాయని కథ విషయంలో ఒక అండర్ స్టాండింగ్ వచ్చాక సెట్స్ పైకి వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చని వినికిడి. ఒకపక్క జుడ్వా 2 లాంటి కామెడీ ఎంటర్ టైనర్ తో మరోపక్క అక్టోబర్ లాంటి సెన్సిటివ్ లవ్ స్టోరీస్ తో ఏకకాలంలో మెప్పిస్తున్న వరుణ్ ధావన్ లాంటి నటుడు దొరికితే సుకుమార్ కు కావాల్సింది ఏముంది. ఇది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. తెలుగు దర్శకులు హిందీ సినిమాలు చేయటం పూర్తిగా మానేసిన ట్రెండ్ లో చాలా కాలం తర్వాత సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి రీమేక్ తో దాన్ని మళ్ళి మొదలుపెట్టాడు. ఇప్పుడు సుకుమార్ ది కూడా ఓకే అయితే ఇద్దరు బాలీవుడ్ లో అడుగు పెట్టినట్టు అవుతుంది.