Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ కోసం సుక్కు ప్లాన్ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   29 Aug 2022 5:30 PM GMT
పుష్ప‌రాజ్ కోసం సుక్కు ప్లాన్ మామూలుగా లేదుగా!
X
ఏ సినిమాలో అయినా విల‌న్ ఎంత స్ట్రాంగ్ గా వుంటే హీరో క్యారెక్ట‌ర్ డ‌బుల్ స్ట్రాంగ్ గా క‌నిపిస్తుంది. ఇప్ప‌డు ఇదే ఫార్ములాను స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఫాలో అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `పుష్ప : ది రైజ్‌`. గ‌త ఏడాది విడుద‌లైన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో ట్రెండ్ అయింది. మేన‌రిజ‌మ్‌, శ్రీ‌వల్లి సాంగ్‌, ఇలా ప్ర‌తీదీ నెట్టింట ట్రెండ్ గా నిలిచింది.

సినిమా కూడా అనూహ్య విజ‌యాన్ని సాధించిన వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 360 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. బాలీవుడ్ లో ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేకుండా విడుద‌లై రూ. 100 కోట్ల మార్కుని దాట‌డం విశేషం.

ఈ రేంజ్ లో `పుష్ప‌` వ‌సూళ్ల ని రాబ‌ట్ట‌డంతో యావ‌త్ దేశం మొత్తం ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న `పుష్ప ది రూల్‌` కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. పార్ట్ 2 త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రాబోతోంది. పార్ట్ 1 సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డంతో ఈ మూవీ బడ్జెట్ ని కూడా భారీగా పెంచేశారు.

పార్ట్ 2ని దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌పైకి తీసుకురాబోతున్నారు. వ‌చ్చే నెల నుంచే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. పార్ట్ 2లో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ ని రంగంలోకి దించేస్తున్నార‌ట‌. పార్ట్ 1 లో సునీల్‌, అన‌సూయ‌, అజ‌య్ ఘోష్‌, క‌న్న‌డ నటుడు ధ‌నుంజ‌య‌.. క్లైమాక్స్ కి ముందు ఫాహ‌ద్ ఫాజిల్ ఇందులో విల‌న్ లుగా క‌నిపించారు.

ఇక పార్ట్ 2 లో ఫాహ‌ద్ ఫాజిల్ భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో పిచ్చెక్కించ‌బోతున్నాడ‌ని పార్ట్ 1 క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన సుకుమార్ త‌న‌తో పాటు పార్ట్ 2 కోసం మ‌రో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ ని కూడా రంగంలోకి దించేస్తున్నాడట‌. అది పొలిటీషియ‌న్ పాత్ర అని తెలుస్తోంది.

త‌ను భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ తో క‌లిసి పుష్ప‌రాజ్ ను ఎలా ఆడుకున్నాడు? .. ఈ ఇద్ద‌రికి పుష్ప‌రాజ్ ఎలా చుక్క‌లు చూపించాడ‌న్న‌దే పార్ట్ 2 అస‌లు క‌థ‌గా చెబుతున్నారు. ర‌ష్మిక మందన్న హీరోయిన్ గా న‌టించ‌నున్న ఈ మూవీకి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని కీల‌క ట్యూన్స్ ని పూర్తి చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.