Begin typing your search above and press return to search.
సుధీర్‌ను అసిస్టెంట్‌గా పెట్టుకోవాల్సింది-సుక్కు
By: Tupaki Desk | 11 April 2015 1:00 PM ISTస్వామిరారా సినిమా చూశాక.. సుధీర్ వర్మను తన అసిస్టెంట్ పెట్టుకుని ఒక్క సినిమా అయినా తీయలేదే అని చాలా బాధపడ్డాడనని చెప్పాడు టాప్ డైరెక్టర్ సుకుమార్. సుధీర్ డైరెక్టర్ అయ్యాక కూడా మళ్లీ తన దగ్గరికి వచ్చి అసిస్టెంట్‌గా చేస్తే బాగుంటుందని అనుకున్నానని చెప్పాడు సుక్కు.
''నేను ఓ సన్నివేశం నటీనటులకు చెప్పి వాళ్లతో నటింపజేయడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటాను. కానీ స్వామిరారా సినిమా చూస్తే సుధీర్ ఎంత సింపుల్‌గా సినిమా తీస్తాడో.. నటీనటులతో ఎంత సింపుల్‌గా పని చేయించుకుంటాడో అర్థమైంది. అలాంటోడు నాకు అసిస్టెంట్‌గా చేస్తే బాగుంటుందనిపించింది. నాకు అసిస్టెంట్‌గా పని చేయకుండా మిస్సయిపోయాడే అని ఓ డైరెక్టర్ గురించి బాధపడ్డ సందర్భం అదొక్కటే'' అని సుకుమార్ చెప్పాడు.
కచ్చితంగా హిట్టయ్యే లక్షణాలున్న సినిమాలా 'దోచేయ్' కనిపిస్తోందని.. సుధీర్ ఈ సినిమాను కూడా బాగా తీశాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని సుకుమార్ అన్నాడు. నాగచైతన్యతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని.. 'దోచేయ్'లో అతను చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడని సుక్కు చెప్పాడు. 1 సినిమాలో కృతి సనన్‌కు తాను ఎంతెంతో బిల్డప్ ఇచ్చి ఇలా చెయ్ అలా చెయ్ అంటూ సీన్ చెప్పేవాణ్నని.. తను మాత్రం నేనిలాగే చేస్తా అంటూ తనదైన స్టయిల్లో సినిమా చేసేసేదని అన్నాడు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో ఆర్య-2 చేశానని.. ఆయనది చాలా మంచి మనసని సుకుమార్ చెప్పాడు.