Begin typing your search above and press return to search.

చెర్రీ కోసం ఫిజిక్స్ రాస్తున్న సుక్కు

By:  Tupaki Desk   |   26 March 2016 1:00 PM IST
చెర్రీ కోసం ఫిజిక్స్ రాస్తున్న సుక్కు
X
రామ్ చరణ్ కి మాస్ లో తిరుగులేని ఇమేజ్ ఉంది. ఓవర్సీస్ లో వసూళ్లు వీక్ గా ఉన్నా.. చెర్రీ సినిమాలు భారీ కలెక్షన్లు సాధించడానికి కారణం.. మాస్ ఇమేజ్. అయితే ఈ మాస్ హీరో అన్న ఇమేజ్ బలమే అయినా.. కొన్ని సార్లు వీక్ నెస్ కూడా అవుతోందనే విషయాన్ని చరణ్ గమనించాడు. అందుకే తన ఇమేజ్ పరిధిని పెంచుకునేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. గోవిందుడు అందరివాడేలే - బ్రూస్ లీ చిత్రాలు ఇలా ట్రై చేసినవే.

ప్రస్తుతం చేస్తున్న తని ఒరువన్ రీమేక్ ధృవ కూడా రామ్ చరణ్ కొంత కాంప్రమైజ్ చేస్తున్నదే అని చెప్పాలి. హీరో-విలన్ గేమ్ ప్లే పర్ఫెక్ట్ గానే ఉన్నా.. విలన్ డామినేషన్ ఎక్కువగా కనిపించే కాన్సెప్ట్ ఇది. దీని తరువాత చేయనున్న సినిమాలో కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అయేందుకు చెర్రీ ట్రై చేయనున్నాడు. తనిఒరువన్ రీమేక్ తర్వాత ఈ చిరుత సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈ స్టోరీలో క్లాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

రామ్ చరణ్ కోసం సుకుమార్ సిద్ధం చేస్తున్న స్టోరీ ఫిజిక్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయట. మాథ్య్ - ఫార్ములాస్ - కెమిస్ట్రీ.. ఇలా ఏదో సబ్జెక్ట్ కి సంబంధించిన సిద్ధాంతాలను తన మూవీలో అప్లై చేసే సుకుమార్.. ఈ సారి చరణ్ కోసం ఫిజిక్స్ ఫార్ములాలను ఉపయోగించనున్నాడని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో మూవీలో ఎనర్జీ అంటూ సిద్ధాంతం చెప్పించిన సుక్కు.. చెర్రీతో ఫిజిక్స్ సిద్ధాంతాలు చెప్పించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు.