Begin typing your search above and press return to search.
సుకుమార్ తొలిసారి ఎవర్ని ప్రేమించాడు?
By: Tupaki Desk | 21 Jan 2016 5:00 PM IST‘కుమారి 21 ఎఫ్’ సినిమా చూస్తుంటే అందరికీ సుకుమార్ టీనేజీనే గుర్తుకొచ్చింది. ఎందుకంటే తన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఆ స్క్రిప్టు రాశానని చెప్పాడు సుక్కు. ఇక ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన సుక్కును తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పమంటే.. ‘కుమారి 21’ ఎఫ్ సినిమాకు రిలేటయ్యే ఆసక్తికర విశేషాలేమైనా చెబుతాడేమో అని చూశారు జనాలంతా.
సుకుమార్ మాత్రం అందరికీ దిమ్మదిరిగిపోయే సమాధానం ఇచ్చాడు. నా ఫస్ట్ క్రష్ పదో తరగతి తర్వాత పుట్టిందని చెప్పి.. ఆ క్రష్ మరెవరి మీదో కాదు.. ‘మహేష్’పై అని చెప్పి షాకిచ్చాడు. దీంతో యాంకర్ సుమ సహా ఆడిటోరియంలో అందరూ షాకైపోయారు. మహేష్ అయితే తల కొట్టుకుంటూ సిగ్గు పడిపోయాడు. సుక్కు మహేష్ తో ‘1 నేనొక్కడినే’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మహేష్, సుక్కు మధ్య అనుబంధానికి మాత్రం ఢోకా లేదు. అందుకే ఇద్దరూ కలిసి ‘1’ సినిమా తీసిన 14 రీల్స్ సంస్థ నుంచి వస్తున్న ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఆడియో ఫంక్షన్ కు వచ్చారు.
‘1 నేనొక్కడినే’ రిజల్ట్ తర్వాత కూడా 14 రీల్స్ నిర్మాతలు తనతో మంచి రిలేషనే కొనసాగించారని.. ఇలాంటి నిర్మాతల్ని తానెక్కడా చూడలేదని సుక్కు చెప్పాడు. నాని సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడని.. డైరెక్టర్ హను రాఘవపూడి టాలెంట్ ఏంటో ‘అందాల రాక్షసి’ సినిమా చూస్తేనే అర్థమైందని సుకుమార్ అన్నాడు. ట్రైలర్ చాలా బాగుందని.. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పెద్ద హిట్టవువుతుందని సుక్కు చెప్పాడు.