Begin typing your search above and press return to search.
సుకుమార్ ను దిల్ రాజు రీమేక్ చేయమంటే..
By: Tupaki Desk | 18 Oct 2015 11:00 PM ISTఇంతకుముందు కృష్ణవంశీని క్రియేటివ్ డైరెక్టర్ అనేవాళ్లు. ఇప్పుడా కిరీటం సుకుమార్ నెత్తిన పెట్టేశారు జనాలు. ఆ పేరు అతడికి ఊరికే ఏమీ రాలేదు. తొలి సినిమా దగ్గర్నుంచి వైవిధ్యమైన బాటలోనే నడుస్తున్నాడు సుక్కు. అతడి సినిమాలు ఫ్లాపైతే కావచ్చు కానీ.. కొత్తదనానికి మాత్రం ఢోకా ఉండదు. కథల్లో అంత వైవిధ్యం కోరుకునే సుకుమార్.. పాత కథల్ని రీసైకిల్ చేయడానికే ఇష్టపడని సుకుమార్.. ఇంకొకరు తీసేసిన సినిమాల్ని రీమేక్ చేయడానికి ఒప్పుకుంటాడా? ఫలానా సినిమాను రీమేక్ చేసి పెట్టు అని ఏ నిర్మాతైనా అతణ్ని అడుగుతాడా? ఐతే దిల్ రాజు.. సుకుమార్ ను రీమేక్ కోసం అడిగాడట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం.
ఐతే ఇది ఇప్పటి సంగతి కాదు. పుష్కరం కిందటి మాట. నిర్మాతగా తన తొలి సినిమా ‘దిల్’ షూటింగ్ సందర్భంగా వినాయక్ దగ్గర అసిస్టెంటుగా పని చేస్తున్న సుకుమార్ టాలెంటును పసిగట్టి.. ‘దిల్’ హిట్టయితే అతడికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చాడట రాజు. అనుకున్నట్లే ‘దిల్’ హిట్టయింది. పాత మాట గుర్తు చేస్తూ రాజు దగ్గరికి వెళ్తే.. ‘ఇదిగో ఇది తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమా స్క్రిప్టు. దీన్ని నువ్వు తెలుగులోకి రీమేక్ చేయాలి’ అన్నాడట రాజు. కానీ నేను రీమేక్ చేయను.. నా సొంత కథతోనే సినిమా తీస్తా అనేశాడట సుకుమార్. ఐతే రాజు ఏమీ ఫీలవకుండా సుకుమార్ సొంత కథతోనే సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఐతే ముందు ‘ఆర్య’ కథ చెబితే కమర్షియల్ గా వర్కవుట్ కాదని అన్న రాజు.. తర్వాత తన టీంతో చర్చించాక సుకుమార్ కు ఓకే చెప్పి సినిమా చేశాడట. అదీ సంగతి.