Begin typing your search above and press return to search.

సుక్కూ లెక్క వేరు బాసూ!!

By:  Tupaki Desk   |   1 May 2018 1:41 PM IST
సుక్కూ లెక్క వేరు బాసూ!!
X
1980ల నాటి గ్రామీణ‌ ప‌రిస్థితుల‌ను... ప‌ల్లె రాజ‌కీయాల‌ను ఆధారం చేసుకుని సుకుమార్ తెర‌కెక్కించిన పీరియాడిక్‌ రివెంజ్ డ్రామా ‘రంగ‌స్థ‌లం’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డు లెవెల్లో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. అంత‌కంటే ఎక్కువ‌గా ద‌ర్శ‌కుడి ప‌నితీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. ఇప్పుడు ఆయ‌న ఫ్యూచ‌ర్‌ సినిమాల‌పై నెల‌కొన్న‌ క్రేజ్ వేరు. ఆ క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకుంటున్నాడీ లెక్క‌ల మాస్ట‌ర్‌.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి ఫాలోయింగ్ భారీగా ఉన్నా... ఆయ‌న న‌ట‌న‌పై లెక్క‌లేన‌న్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే చ‌ర‌ణ్ నుంచి త‌న‌కు కావ‌ల్సిన న‌ట‌న‌ను బ‌య‌టికి లాగ‌డంలో పూర్తిగా స‌క్సెస్ అయ్యాడు సుకుమార్‌. ఓ విధంగా చెప్పాలంటే ‘రంగ‌స్థ‌లం’ ముందు రామ్ చ‌ర‌ణ్ లెక్క వేరు. ‘రంగ‌స్థ‌లం’ చిట్టిబాబు త‌ర్వాత చెర్రీ లెక్క వేరు. ఈ క్రేజ్ కి కార‌ణం సుకుమారే. అందుకే సుకుమార్ కి బోలెడ‌న్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మా బ్యాన‌ర్లో సినిమా చెయ్య‌డండే... మా బ్యాన‌ర్లో చెయ్య‌డంటూ... ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క బ్యానర్లు ఆయ‌న‌కి బోలెడంత రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే ఈ లెక్క‌ల మాస్ట‌ర్ లెక్క మాత్రం వేరు.

ఒకసారి ఒకే సినిమాపై ఫోక‌స్ పెడ‌తానంటున్న సుకుమార్‌... ‘రంగ‌స్థ‌లం’ నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్లోనే త‌ర్వాతి సినిమాకి క‌మిట్ అయ్యాడు. ఇందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా న‌టించ‌బోతున్నాడు. వ‌చ్చే ఏడాది సెట్స్ మీదికెళ్లే ఈ సినిమా కోసం ఇప్ప‌టికే 6 కోట్లు అడ్వాన్స్ అందింద‌ట సుకుమార్ కి. అడ్వాన్స్ రూపంలో ఇంత భారీ మొత్తం అందుకున్న టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సుక్కూ ఒక్క‌డే! మ‌హేష్ - సుక్కూ కాంబినేష‌న్లో ఇంత‌కు ముందే ‘వ‌న్‌- నేనొక్క‌డినే’ సినిమా వ‌చ్చింది. అప్పుడు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు మాత్ర‌మే ద‌క్కాయి. ఈసారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కూడా వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు ప్రిన్స్ అభిమానులు.