Begin typing your search above and press return to search.
సుక్కు- చెర్రీ సినిమాకి అలాంటి టైటిలా?
By: Tupaki Desk | 8 Nov 2016 2:33 AM GMTఓ సినిమా షూటింగ్ మొదలైనా కాకపోయినా.. టైటిల్ అనౌన్స్ చేయకపోతే మాత్రం.. రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చేస్తుంటాయి. తమ మూవీ టైటిల్ అది కాదు మొర్రో అని మేకర్స్ మొత్తుకుంటున్నా సరే.. ఎవరికి తోచినట్లుగా ఏదో ఒక పేరు పెట్టేసి ప్రచారం చేసేస్తూ ఉంటారు. ప్రస్తుతం ధృవ చిత్రానికి ప్యాచప్ వర్క్స్ లో ఉన్న చెర్రీ.. డిసెంబర్ లో సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్-సుకుమార్ ల కాంబినేషనల్ లో రానున్న మూవీకి.. 'ఫేస్ బుక్ లైవ్ చాట్ @ 8.18 pm' అనే టైటిల్ ని ఆలోచిస్తున్నారనే టాక్ బయల్దేరింది. ఇది సుక్కు మార్క్ టైటిల్ అంటూ హంగామా కూడా చేసేస్తున్నారు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా అనే కన్ఫర్మేషన్ ముందు నుంచే ఉంది. పైగా పీరియాడిక్ టచ్ కూడా ఉంటుందనే టాక్ ఉంది. పల్లెటూరికి-ఫేస్ బుక్ కి.. పీరియాడిక్ కాన్సెప్ట్ కి-లైవ్ ఛాట్ కి ఏ రకంగా చూసినా లింక్ ఉండే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు టైటిల్ లో ఫేస్ బుక్ ఎలా వస్తుందన్నదే అసలు పాయింట్.
విలేజ్ అంటేనే ఫేస్ బుక్ టైటిల్ నప్పదు.. ఇక పీరియడిక్ ఫిలిం అంటే.. 2009కు తీసిన ఏ కథకు అయినా కూడా ఫేస్ బుక్ అనేదే సెట్టవ్వదు. సో చరణ్ టైటిల్ రూమరే అని ఫిక్స్ అయిపోవచ్చు.