Begin typing your search above and press return to search.

చిరంజీవి+రజినీకాంత్=సప్తగిరి

By:  Tupaki Desk   |   3 Dec 2017 1:30 AM GMT
చిరంజీవి+రజినీకాంత్=సప్తగిరి
X
కమెడియన్ టర్న్డ్ హీరో సప్తగిరి.. తాను కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్ని తెలివిగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. హీరోగా తన తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎంత బాగా ఉపయోగించుకున్నాడో తెలిసిందే. ఇప్పుడు హీరోగా తన రెండో సినిమా ‘సప్తగిరి ఎల్ ఎల్బీ’కి కూడా సెలబ్రెటీల అండ బాగానే తీసుకుంటున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా ఆవిష్కరింప జేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాని వచ్చి ఒక పాట లాంచ్ చేశాడు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ సుకుమార్ వచ్చి మరో పాటను లాంచ్ చేశాడు.

ఈ సందర్భంగా సుకుమార్ సప్తగిరిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సప్తగిరి ఎల్ ఎల్బీ’ సినిమాలో సప్తగిరి డ్యాన్సులు.. ఫైట్లు అలవోకగా చేయడం చూసి తాను షాకయ్యానని అన్నాడు సుక్కు. అతడిని చూస్తే చిరంజీవి.. రజినీకాంత్ లను కలిపి చూస్తున్నట్లుగా అనిపిస్తోందని సుక్కు చెప్పడం విశేషం. ఇంతకుముందు వి.వి.వినాయక్ సైతం సప్తగిరి డ్యాన్సుల విషయంలో ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ ‘జాలీ ఎల్ ఎల్బీ ’కి రీమేక్ గా వస్తున్న ‘సప్తగిరి ఎల్ ఎల్బీ’కి చరణ్ లక్కాకుల దర్శకత్వం వహించాడు. హీరోగా సప్తగిరి తొలి సినిమాను నిర్మించిన రవికిరణే ఈ చిత్రానికి కూడా నిర్మాత. డిసెంబరు 8న ఈ సినిమా ప్రేక్షకలు మందుకొస్తుంది.