Begin typing your search above and press return to search.
సుక్కు మాట.. ఎన్టీఆర్ ఒక డ్రగ్
By: Tupaki Desk | 12 Jan 2016 8:34 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రగ్ లాంటి వాడని అంటున్నాడు సుకుమార్. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా చేయడం లైఫ్ టైం మెమొరీ అని చెప్పాడు సుక్కు. ఎన్టీఆర్ నందమూరి వంశంలో పుట్టడం వల్ల హీరో అయ్యాడని.. ఒకవేళ పుట్టకపోయుంటే ఏదో ఒకటి కనిపెట్టి ప్రపంచహీరో అయ్యుండేవాడని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు సుక్కు.
వ్యక్తిగతంగా ఎన్టీఆర్ కు తానెంతగా కనెక్టయిపోయానో చెబుతూ.. ‘‘ఎన్టీఆర్ ఒక డ్రగ్. నేను కూడా ఆ డ్రగ్ కు ఎడిక్ట్ అయిపోయా. అతను ఒక్క రోజు సెట్ కు రాకపోయినా పిచ్చెక్కిపోయేది. తారక్ ప్రేమ తుఫాన్ లా ఉంటుంది. దాంట్లో మనం మునుగుతూనే ఉంటాం. తనతో ఈ జర్నీని, ఎమోషన్ ను లైఫ్ లాంగ్ మరచిపోలేను. మా మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. దాన్నుండి నేను బయటకు రావాలనుకోవడం లేదు’’ అంటూ సుక్కు ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాడు.
ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ గురించి వివరిస్తూ..‘‘తారక్ ఏ విషయాన్నైనా ఒక్కసారి చెబితే చాలు పట్టేస్తాడు. ఏ ఎమోషన్ అయినా క్యారీ చేయగలడు. ఈ సినిమాలో తారక్ తప్ప మరే హీరోను ఉహించలేం. తారక్ ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాడు. ఓ ఎమోషనల్ సీన్లో తను బరస్ట్ అయిపోయాడు. నేను, కెమెరామెన్ అందరూ ఏడుస్తున్నాం. ఈ సినిమాకు పని చేసిన విదేశీయులు కూడా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టేసుకున్నారు’’ అని సుక్కు చెప్పాడు.