Begin typing your search above and press return to search.

కొరటాలను ఆకాశానికెత్తేసిన సుకుమార్!

By:  Tupaki Desk   |   26 Dec 2021 5:00 PM IST
కొరటాలను ఆకాశానికెత్తేసిన సుకుమార్!
X
సుకుమార్ ఎప్పటికప్పుడు జోనర్లను మారుస్తూ వెళుతుంటాడు. కథా నేపథ్యాలు మారుస్తూ .. అందుకు తగిన లుక్స్ తో కథానాయకులను కొత్తగా చూపిస్తుంటాడు. అందువల్లనే ఆయనతో సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తిని చూపుతుంటారు. ఆయన సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని కనబరుస్తుంటారు. అలా ఆయన నుంచి వచ్చిన సినిమానే 'పుష్ప'. ఈ సినిమా కథ అంతా కూడా మాస్ యాక్షన్ తో నడుస్తుంది .. కానీ టైటిల్ చూస్తేనేమో సాఫ్ట్ గా అనిపిస్తోందని అల్లు అర్జున్ అనగానే, 'పుష్ప అంటే ఫ్లవర్ కాదమ్మా .. ఫైరూ' అనే డైలాగ్ వేయడం సుకుమార్ కే సాధ్యమైంది.

ఈ సినిమా విడుదలై భారీ వసూళ్లను కొల్లగొడుతూ ముందుకు దూసుకువెళుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. "ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందురోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు. తెల్లవారిన తరువాత ఫస్టు మెసేజ్ నాకు ఫాహద్ ఫాజిల్ నుంచి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అని ఆయన చెప్పిన తరువాత నాకు 'హమ్మయ్య' అనిపించింది. ఆ తరువాత నాకు కొరటాల శివ గారి నుంచి ఫస్టు కాల్ వచ్చింది. ఈ సినిమా గురించి ఆయన 45 నిమిషాల సేపు నాతో మాట్లాడారు.

సినిమాను గురించి .. బన్నీ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. అంత ఎమోషనల్ గా నేను ఎప్పుడూ కూడా కొరటాల శివ గారిని చూడలేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే తన నుంచి నిజాయితీగా నేను నేర్చుకున్న విషయం ఏమిటంటే .. ఆయన సినిమాలు చాలా ట్రూత్ ఫుల్ గా ఉంటాయి. అదే విషయాన్ని నేను ఆయనతో చెప్పాను. చాలా ఎమోషనల్ గా ఆయన సినిమా మొత్తాన్ని ఎనలైజ్ చేశారు. ఆ బూస్టప్ వలన నాకు ఎంతో ఎనర్జీ వచ్చింది. హిట్ .. బ్లాక్ బస్టర్ .. పేరు ఏదైనా కానీయండి .. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడమే నా ఉద్దేశం. అందుకే ఇంత కష్టపడి సినిమాలు చేసేది కూడా" అన్నాడు.

ఆ తరువాత బన్నీ మాట్లాడుతూ .. ఈ సినిమాలో శ్రీవల్లీ పాత్రను రష్మిక చాలా బాగా చేసింది. అవతల ఆర్టిస్ట్ బాగా చేసినప్పుడే ఇవతల ఆర్టిస్ట్ నుంచి మంచి అవుట్ పుట్ వస్తుంది. అలా నేను ఈ పాత్రను బాగా చేయడంలో రష్మిక పాత్ర కూడా ఉంది. ఈ సినిమా చూసిన తరువాత చంద్రబోస్ గారు నాకు కాల్ చేశారు. ఆయన 'ఆర్య' నుంచి నా సినిమాలకు రాస్తున్నారు. ఆయన అభినందనలను నేను మాటల్లో చెప్పలేను" అనగానే, సుకుమార్ జోక్యం చేసుకుంటూ, నాతో కూడా చంద్రబోస్ గారు ఒక మాట అన్నారు. " నేను పేపర్ మీద రాసిన లిరిక్స్ కంటే బన్నీ ఫేస్ మీద పలికిన ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయని అన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.