Begin typing your search above and press return to search.

లాజిక్‌ ఉన్నా ఆ మ్యాజిక్‌ సూపర్‌

By:  Tupaki Desk   |   13 Jan 2016 4:51 PM IST
లాజిక్‌ ఉన్నా ఆ మ్యాజిక్‌ సూపర్‌
X
నిజానికి లైఫ్‌ లో ఎంత సైన్స్‌ తెలిసినా.. ఎంత మ్యాథమ్యాటిక్స్‌ తెలిసినా.. కొన్న సంఘటనలు మాత్రం ఎవ్వరికీ అర్ధంకావు. దానినే మనం ప్రకృతి ధర్మం అంటుంటాం. అయితే ఎంతో లాజికల్‌ గా తన హీరోలతో మాట్లాడించే సుకుమార్ కూడా.. ఈసారి నేచర్‌ టచ్‌ తో పిచ్చెక్కించాడు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఆ నేచర్‌ లాజిక్‌ కేక పెట్టించింది.

నిజానికి హీరోయిన్‌ రకుల్‌ ను తన లాజిక్కులతో పడేయాలని అనుకుంటాడు తారక్‌. ఇంప్రెస్‌ చేస్తాడు కూడా. అయితే నిజంగా ఒకమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడిపోవాలంటే మాత్రం.. ప్రకృతి అంతా సమ్మళితం అయ్యి అందుకు పూనుకోవాలి అంటుంది రకుల్‌. అది నిజంగానే నిజం. ఈ ఫిలాసఫీ నమ్మేవారికి తరువాత సీన్లోనే డైరక్టర్‌ మార్కు టచ్‌ కూడా ఇచ్చాడు సుక్కూ. ప్రకృతి వారిని ప్రేమలో పడేలా చేస్తుంది.

లాజిక్‌ ఉన్నా కూడా ప్రకృతి కాన్సెప్టుతో సుకుమార్ చేసిన మ్యాజిక్‌ చాలామంది యూత్‌ కు బాగా నచ్చుతోంది. రొమాంటిక్‌ ట్రాక్‌ లో కూడా సైన్స్‌ ఏంటి రాజా అంటూ పెదవి విరిచినవారే.. ఈ ప్రకృతి టచ్‌ తో వావ్‌ అంటున్నారు. సూపర్బ్‌ సుక్కూ.