Begin typing your search above and press return to search.

శ్రీవాస్ మాటతో సుక్కు ఏకీభవించలేదు

By:  Tupaki Desk   |   24 Jan 2016 1:30 PM GMT
శ్రీవాస్ మాటతో సుక్కు ఏకీభవించలేదు
X
సంక్రాంతికి ఎన్నడూ లేని విధంగా నాలుగు క్రేజున్న సినిమాలు రిలీజవడం.. ఆ నాలుగూ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అరుదైన విషయం. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా కూడా సంతోషంగా ఉంది. ఐతే ఇలా ఒకేసారి పోటీకి దిగడం వల్ల నాలుగు సినిమాలకూ నష్టం జరిగిందని ఇప్పటికే గళం వినిపించాడు ‘డిక్టేటర్’ డైరెక్టర్ శ్రీవాస్. తాజాగా సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల డైరెక్టర్లూ కలిసి ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మరోసారి శ్రీవాస్ సంక్రాంతి పోటీ గురించి ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘సంక్రాంతికి నాలుగు భిన్నమైన సినిమాలు రావడం.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ప్రేక్షకుల అదృష్టం. కానీ అది మా దురదృష్టం. ఎందుకంటే సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల నుంచి తెలుగు సినిమాకు రూ.150 కోట్లు వసూలవుతాయనుకుంటే.. ఆ మొత్తాన్ని నాలుగు సినిమాలూ పంచుకోవాల్సి వచ్చింది. నాలుగు సినిమాలు వచ్చాయి కదా అని అదనంగా డబ్బులేమీ తీయరు జనాలు. ఎంత ఖర్చు పెట్టడానికి ప్రిపేరయ్యారో అంతే పెడతారు. అదే రెండు సినిమాలు రిలీజైతే ఆ మొత్తం ఆ రెండు సినిమాలకే వచ్చేది’’ అన్నాడు శ్రీవాస్.

ఐతే సుకుమార్ మాత్రం శ్రీవాస్ వాదనతో అంగీకరించినట్లు కనిపించలేదు. ‘‘నాలుగు సినిమాలు రిలీజైతే నాలుగూ సక్సెస్ అనిపించుకోవడం విశేషం. నిజంగానే ఆనందించాల్సిన విషయం. ఎక్కువ మందిని సినిమా హాల్లోకి ఆకర్షించాం. ఈ విషయంలో బాహుబలి సినిమాకు మేం థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడూ సినిమాలకు రాని వాళ్లను కూడా థియేటర్లకు రప్పించింది. సంక్రాంతి సినిమాల విషయంలోనూ జనాలు మామూలు స్థాయి కంటే ఎక్కువగానే చూశారనుకుంటున్నా’’ అని సుక్కు చెప్పాడు.