Begin typing your search above and press return to search.
చెర్రీతో రొమాన్స్ మాత్రమే
By: Tupaki Desk | 21 Feb 2016 11:20 AM ISTడైరెక్టర్ సుకుమార్ సినిమాలంటే ఫుల్లుగా తెలివితేటలను బేస్ చేసుకునే ఉంటాయనే ఓ నమ్మకం ఏర్పడిపోయింది. గత రెండు సినిమాల్లోనూ ఇంటెలిజెన్స్ ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేయడంతో.. సుక్కు మూవీస్ కి ఓ బ్రాండ్ పడిపోయింది. కానీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం స్టైల్ మార్చబోతున్నాట ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. రామ్ చరణ్ కోసం ఓ మాంచి రొమాంటిక్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.
మైండ్ గేమ్స్, ఇంటెలిజెంట్ గేమ్ ప్లేస్ లాంటివి లేకుండా ఫక్తు లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టెయినర్ గానే చెర్రీ మూవీ ఉండనుంది. దీనికి కారణం రామ్ చరణే అంటున్నారు. యువతను ఆకట్టుకునేలా ఓ విభిన్నమైన లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నానని, ఇందుకు వీలుగానే స్టోరీ చేయమని అడిగాడట చెర్రీ. మెగా వారసుడు చెప్పిన మాటలను ఇంకా స్పష్టంగా అర్ధం చేసుకుంటే.. వన్ నేనొక్కడినే - నాన్నకు ప్రేమతో టైప్ లో కాకుండా.. ఆర్య - 100పర్సెంట్ లవ్ టైపులో మూవీ చేయాలని ఉంది చెప్పాడన్న మాట.
తన కెరీర్ లో ఇప్పటివరకూ కేవలం ఆరెంజ్ ఒక్కటే రామ్ చరణ్ చేసిన లవ్ స్టోరీ. అది కూడా సక్సెస్ కాలేదు. అప్పటి నుంచి ప్రేమకథలపై చెర్రీకి ఇంట్రెస్ట్ ఉన్నా.. సరైన దర్శకుడు దొరక్క చేయలేదని చెప్పచ్చు. ఇప్పుడా లోటును పూడ్చేందుకు ఇలా సుకుమార్ ని లవ్ స్టోరీ చేయమన్నాడు రామ్ చరణ్.