Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్‌ కోసం సుకుమార్‌?

By:  Tupaki Desk   |   18 Oct 2015 5:00 PM IST
చ‌ర‌ణ్‌ కోసం సుకుమార్‌?
X
పరాజ‌యం నుంచి కోలుకున్న‌ట్టే క‌నిపిస్తున్నాడు సుకుమార్‌. ఇదివ‌ర‌క‌టిలా ఆచితూచి సినిమా చేయ‌డం కాకుండా ఇక నుంచి వేగం పెంచాల‌ని డిసైడైపోయాడు. 1 (నేనొక్క‌డినే) త‌ర్వాత కూడా వెంట‌నే క‌థ సిద్ధం చేసుకొన్న సుకుమార్‌కి ఎన్టీఆర్ నుంచి తొంద‌ర‌గా గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. ఆ గ్యాప్‌ లో ఖాళీగా ఉండ‌కుండా కుమారి 21ఎఫ్ స్క్రిప్టు చేసేశాడు. త‌న శిష్యుడితో ఆ సినిమా తీయించాడు. ఇప్పుడు సుక్కు ఎన్టీఆర్‌ తో నాన్న‌కు ప్రేమ‌తో చేస్తున్నాడు. అది సెట్స్‌ పై ఉండ‌గానే చ‌ర‌ణ్ కోసం మ‌రో క‌థ సిద్ధం చేసుకొంటున్నాడ‌ట‌. ఖాళీ దొర‌గ్గానే ఆ క‌థ‌ని చ‌ర‌ణ్‌ కి చెప్పి ఓకే చేయించాల‌నే ఆలోచ‌న‌లో సుకుమార్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

రామ్‌ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం త‌ని ఒరువ‌న్ సినిమాని రీమేక్ చేసే ప‌నిలో ఉన్నాడు. జ‌న‌వరిలో ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లిపోతుంది. నాలుగైదు నెల‌ల్లో పూర్త‌వుతుంది కాబ‌ట్టి ఆ వెంట‌నే సుక్కు త‌న సినిమాని ప‌ట్టాలెక్కించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సుకుమార్‌ లాంటి ద‌ర్శ‌కుడు సినిమా చేస్తాన‌ని ముందుకొస్తే చ‌ర‌ణ్ కాద‌నే ప్ర‌సక్తే ఉండ‌దు. పైగా సుకుమార్‌ కీ, మెగా కాంపౌండ్‌ కీ మంచి అనుబంధముంది. సో... ఆ కాంబినేష‌న్‌ లో ప్రాజెక్టు ప‌క్కా అని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ట్రేడ్ వ‌ర్గాలు మాత్రం సుకుమార్ ప్ర‌స్తుతం తీస్తున్న సినిమా `నాన్న‌కు ప్రేమ‌తో` రిజ‌ల్ట్‌ ని బ‌ట్టే త‌దుప‌రి ప్రాజెక్టు ఉంటుంద‌ని చెబుతున్నాయి. సుకుమార్ ఎలాగో 1 (నేనొక్క‌డినే)తో దెబ్బ తిన్నాడు కాబ‌ట్టి నాన్న‌కు ప్రేమ‌తో సినిమాని బాగానే తీసుంటాడు. ఆ సినిమాపై ఎన్టీఆర్ కూడా చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నాడు.