Begin typing your search above and press return to search.
విజయ్ కోసం ఆ కథను బయటికి తీస్తున్నాడా?
By: Tupaki Desk | 29 Sept 2020 9:00 AM ISTఈ రోజు టాలీవుడ్ షాకయ్యే అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్.. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కెరీర్ ఆరంభంలో సుక్కు.. రామ్, నాగచైతన్య లాంటి మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేశాడు కానీ.. ఆ తర్వాత మాత్రం బడా స్టార్లతోనే సినిమాలు లాగిస్తున్నాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లతో అతను సినిమాలు లైన్లో పెడుతూ వచ్చాడు. ఇప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉన్న సుక్కు.. ‘పుష్ప’ లాంటి మెగా మూవీ తర్వాత విజయ్‌తో సినిమా చేయడం అంటే సర్ప్రైజే. ఐతే తాను ఎంతగానో ఇష్టపడి పక్కన పెట్టిన ఓ కథను సినిమాగా తీయాలంటే అందుకు విజయ్ దేవరకొండే కరెక్ట్ అన్న ఉద్దేశంతో సుక్కు ఈ దిశగా అడుగులేసినట్లు తెలుస్తోంది.
‘రంగస్థలం’ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అయిన సుకుమార్.. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో కథ కోసం కసరత్తులు చేశాడు. కొన్ని నెలల పాటు సంబంధిత పుస్తకాలు చదివి స్క్రిప్టు కోసం కొంత మేర ప్రయత్నాలు చేశాడు. ఐతే మహేష్ బాబుతో అలాంటి కథ అస్సలు వర్కవుట్ కాదన్న సన్నిహితుల సలహా మేరకు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కొత్త కథ తయారు చేశాడు. అనివార్య కారణాలతో అది మహేష్ నుంచి బన్నీకి మళ్లింది. ఐతే తెలంగాణ సాయుధ పోరాటం మీద చేసిన వర్క్ మాత్రం సుక్కును ఎగ్జైట్ చేస్తూనే ఉంది. ఆంధ్రా ‘బ్రాండ్’ ఉన్న స్టార్లతో ఈ కథను వర్కవుట్ చేయడం కష్టమని భావించి విజయ్ అయితే దీనికి న్యాయం చేస్తాడనిపించి అతడితో ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాడని అంటున్నారు. తనను తాను రీఇన్వెంట్ చేసుకోవడానికి, బడా స్టార్లతోనే సినిమాలు చేస్తాడనే అభిప్రాయాన్ని మార్చడానికి ఈ ప్రాజెక్ట్ ఒక మార్గంగానూ సుక్కుకు కనిపించిందని చెబుతున్నారు. చూద్దాం మరి ఈ సినిమాతో సుక్కు ఎలాంటి ఫలితం రాబడతాడో?