Begin typing your search above and press return to search.

బూతు సినిమా రీమేక్ చేసేద్దాం అనుకున్నాడే

By:  Tupaki Desk   |   1 April 2017 8:58 AM GMT
బూతు సినిమా రీమేక్ చేసేద్దాం అనుకున్నాడే
X
మామూలుగా అయితే కొన్ని సినిమాల్లో నీతి ఎలా ఉన్నా కూడా వాటిని తెరకెక్కించిన తీరు అండ్ రీతి చూస్తే మాత్రం అవి బూతులాగనే ఉంటాయి. అలాంటి కోవకు చెందిన సినిమానే.. అవార్డు విన్నింగ్ డైరక్టర్ సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ''ఒక రొమాంటిక్ క్రైమ్ కథ''. అయితే ఈ సినిమా ధియేటర్లలో ఆడేసి పెద్ద సంచలనాలు క్రియేట్ చేయలేదు కాని.. మన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మాత్రం దీనిని రీమేక్ చేద్దాం అనుకున్నాడట.

''దర్శకుడు సునీల్ రెడ్డి గారి సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. నా సినిమాల్లో అయితే ఫ్లో బట్టి వెళిపోతుంటా. కాని ఆయన సినిమాలు అలా కాదు. ఆయన ఎంతో రీసెర్చ్ చేస్తారు. రియాల్టీకి దగ్గరగా కథ మరియు సీన్లు రాస్తారు. అందుకే ఆయన సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన తీసిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమా చూసినప్పుడు నేనే చాలా ఎక్సయిట్ అయ్యాను. మీరు హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారా అని అడిగాను. వారు చేయట్లేదని చెప్పడంతో.. నేను రీమేక్ చేస్తానని చెప్పాను'' అంటూ సుకుమార్ సెలవిచ్చాడు.

మొన్న సునీల్ రెడ్డి కొత్త సినిమా ''గల్ఫ్'' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన తరువాత.. సుకుమార్ ఈ విధంగా సెలవిచ్చి అందరికీ షాకిచ్చాడులే. కాకపోతే సునీల్ రెడ్డి తీస్తే అది బూతు సినిమాలా ఉంది కాని.. అలాంటి కథలను సుకుమార్ కుమారి 21 ఎఫ్‌ అని రాస్తే క్లాస్ సినిమా అంటూ అందరూ అభినందించేయలేదూ. సో ఈయన టేకింగ్ తో ఆ బూతు సినిమాను కూడా హిందీలో బాగానే తీస్తాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/