Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి మ్యాజిక్‌.. సుక్కు ఎలా మిస్య‌య్యాడు

By:  Tupaki Desk   |   9 Jan 2022 8:00 AM IST
రాజ‌మౌళి మ్యాజిక్‌.. సుక్కు ఎలా మిస్య‌య్యాడు
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి` టాలీవుడ్ ఇండ‌స్ట్రీని స‌మూలంగా మార్చేసింది. ఈ సినిమాతో తెలుగు సినిమా కీర్తి న‌లుదిశ‌లా పాకింది. అంతేనా మ‌న సినిమా బిజినెస్ కూడా ఎల్ల‌లు దాటేసింది. ఇప్ప‌డు తెలుగు సినిమా అంటే వంద‌ల కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు బాలీవుడ్ నిర్మాత‌లే ముందుకొస్తున్న ప‌రిస్థితి. దీనికి ప్ర‌ధాన కార‌ణం రాజ‌మౌళి విజ‌న్‌, ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌, ప్ర‌బాస్ చ‌రిష్మా ప్ర‌ధాన కార‌ణాలుగా నిలిచాయి.

అంతే కాకుండా `బాహుబ‌లి ది బిగినింగ్` లో క‌థ‌ని చెప్పిన విధానం.. బాహుబ‌లి క‌ట్ట‌ప్ప‌ని ఎందుకు చంపాడ‌ని క‌థ‌ని రివీల్ చేయ‌కుండా రాజ‌మౌళి ఇచ్చిన ట్విస్ట్ ఈ శ‌తాబ్దానికే వండ‌ర్ గా మారి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారేలా చేసింది. ఏంటీ క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు?. ఇంత‌కీ ఏం జ‌రిగింది? .. `బాహుబ‌లి -2` ఫ్లాష్ బ్యాక్ లో జ‌క్క‌న్న ఏం చూపించ‌బోతున్నాడు? అని యావ‌త్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది.

రెండేళ్ల కొక సినిమా చూసే మ‌హా మ‌హులే ఈ సినిమా గురించి చ‌ర్చించారంటే రాజ‌మౌళి `పార్ట్ 1`తో ఎలాంటి ఇంపాక్ట్ ని క‌లిగించాడో అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌మౌళి చేసిన మ్యాజిక్ ఊహించ‌ని స్థాయిలో వ‌ర్క‌వుట్ అయింది. దీంతో `బాహుబ‌లి` పార్ట్ 2 కోసం సినీ ప్రియులు, సినిమా అంటే క‌నీసం థియేట‌ర్ కు రాని వారు కూడా ఆస‌క్తిగా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూశారు. దీంతో `బాహుబ‌లి` కంటే `బాహుబ‌లి -2`కు ఓరేంజ్ లో హైప్ ఏర్ప‌డింది.

అయితే ఇదే ఫార్మాట్ ని ఫాలో అవుతూ సుకుమార్ `పుష్ప ది రైజ్‌` ని తెర‌కెక్కించాడు. ఇందులో ఓ సాధార‌ణ కూలి ఎలా సిండికేట్ కి డాన్ గా మారాడు అన్న‌ది చూపించాడు. స‌మాజం పట్ల క‌సితో ర‌గిలిపోయిన ఓ కూలోడు అదే స‌మాజాన్ని ఏల‌డం కోసం స్మ‌గ్లింగ్ సిండికేట్ కే రారాజుగా ఎలా మారాడు.. ఆ సామ్రాజ్యాన్ని ఎలా త‌న చేజిక్కించుకున్నాడు అన్న‌ది `పుష్ప ది రైజ్‌`లో చూపించాడు సుకుమార్‌.

శ్రీ‌వ‌ల్లికి పుష్ప‌కి జ‌రిగే పెళ్లితో ఫ‌స్ట్ పార్ట్ కి ఎండ్ కార్డ్ వేసేశాడు. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పుకోవాలి. `బాహుబ‌లి` పార్ట్ వ‌న్ లో రాజ‌మౌళి క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంప‌డన్నక్యురియాసిటీని క‌లిగిస్తే `పుష్ప ది రైజ్`ని మాత్రం ఎలాంటి ఇంట్రెస్టింగ్ ముగింపుతో ముగించ‌లేదు. నెక్స్ట్ ఏంటీ అనే ఎండింగ్ లేదు. దీంతో `పుష్ప 2` పై ప్రేక్ష‌కుల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా పోయాయి. పార్ట్ 2లో మెరుపులు వుంటాయ‌ని, జ‌ర్క్ లు వుంటాయ‌ని ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు.

రాజ‌మౌళి `బాహుబ‌లి ది బిగినింగ్‌`ని క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌ని ఆస‌క్తిని రేకెత్తించి మ్యాజిక్ చేసి జ‌నాల అటెన్ష‌న్ ని గ్రాబ్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. కానీ అదే ఫార్ములాని వాడుకుంటూ `పుప్ప‌`ని తెర‌కెక్కించిన సుకుమార్ మాత్రం ఆ మ్యాజిక్ ని కొంతైనా ఫాలో కావాల్సింది కానీ ఇంత తెలిసీ ఎలా మిస్యాడ‌న్న‌ది ఇప్పుడు స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడి మ‌దిని తొలుస్తోంది.