Begin typing your search above and press return to search.

మెగా స్టార్ ని పట్టేసిన చెర్రీ దర్శకుడు?

By:  Tupaki Desk   |   26 Jan 2018 3:49 PM IST
మెగా స్టార్ ని పట్టేసిన చెర్రీ దర్శకుడు?
X
టాలీవుడ్ లో మెగా కాపౌండ్ లో ఒక్క ఛాన్స్ దొరికితే చాలు తప్పకుండా మరొక మెగా హీరోతో సినిమా చేయవచ్చని ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తోన్న టాక్. ఇప్పటికే వినాయక్ - సురేందర్ రెడ్డి ఆ టాక్ ను నిజం చేశారు. అయితే ఇప్పుడు మరో దర్శకుడు కూడా అలాంటి దారిలోనే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాడట. అతను ఎవరో కాదు సుకుమార్. అల్లు అర్జున్ నుంచి ఇప్పుడు రామ్ చరణ్ తో సుకుమార్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే నెక్స్ట్ మెగా లీడర్ మెగాస్టార్ చిరంజీవిని సరికొత్తగా చూపించడానికి ట్రై చేయడానికి కథను సిద్ధం చేసుకుంటున్నాడట. గత కొంత కాలంగా రంగస్థలం సినిమా షూటింగ్ వల్ల మెగా ఫ్యామిలీతో సుకుమార్ కి బాండింగ్ స్ట్రాంగ్ గా సెట్ అయ్యింది. చిరు సుక్కు డైరెక్షన్ ని చాలా ఇష్టపడుతున్నాడు. అయితే ఆ చనువుతో రీసెంట్ గా దర్శకుడు మెగాస్టార్ కి ఒక కథను వినిపించాడట. 25 నిమిషాల వరకు వినిపించించిన ఆ కాన్సప్ట్ చిరుకు కనెక్ట్ అయ్యిందని తెలుస్తోంది.

దర్శకుడు తన స్టైల్ మాస్ మసాలా అంశాలను కలిపి ఆ సినిమాను తెరకెక్కిస్తానని చెప్పడంతో ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని మెగాస్టార్ ఆదేశాలను జారీ చేశాడట. అయితే రంగస్థలం పనులు మొత్తం ఫిబ్రవరిలో అయిపోతాయి.దీంతో ఆ స్క్రిప్ట్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి చిరంజీవిని మెప్పించాలని అనుకుంటున్నాడు సుక్కు. ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత బోయపాటితో ఉంటుందని గతంలోనే అప్డేట్ వచ్చింది. మరి చిరు అడుగు ఎటు పడుతుందో చూడాలి.