Begin typing your search above and press return to search.

చెర్రీపై సుకుమార్ కోపంగా ఉన్నడా?

By:  Tupaki Desk   |   25 Aug 2017 10:44 AM IST
చెర్రీపై సుకుమార్ కోపంగా ఉన్నడా?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి హీరోగానే కాకుండా వ్యక్తిగతంగానూ అందరు మెచ్చుకునే వ్యక్తి. చెర్రీ సినిమాను మొదలు పెట్టాడంటే చాలు సినిమా అయిపోయేవరకు నిర్విరామంగా కష్టపడుతుంటాడనేది టాక్. కానీ ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న "రంగస్థలం 1985" సినిమాను కాస్త స్లోగా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా సుకుమార్ కూడా చెర్రీపై కాస్త గుర్రుగా ఉన్నాడా అని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.

అయితే చరణ్ చిరంజీవి 151వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం చెర్రీ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడట. రీసెంట్ గా రిలీజ్ చేసిన "సైరా" పోస్టర్ రిలీజ్ కోసం చెర్రీ తన షెడ్యూల్ ని కూడా కాదనుకొని ఆ వేడుక కోసం టైమ్ ను కేటాయించడాన్ని తెలుస్తోంది. అంతే కాకుండా సినిమా స్టార్ట్ అయ్యేవరకు చెర్రీ కాస్త బిజీ బిజీగా ఉంటాడట. దీంతో చివరి దశలో ఉన్న రంగస్థలం ఇంకాస్త లెట్ అయ్యేటట్లే కనిపిస్తోంది. చరణ్ ఈ సినిమాకు కాస్త దూరంగా ఉండడంతో మిగతా నటీనటుల డేట్స్ కూడా కాస్త క్లాష్ అయ్యేలా ఉన్నాయనే కామెంట్స్ వినబడుతున్నాయి. చరణ్ తన తండ్రి సినిమాను బాహుబలి కంటే ఉన్నత స్థాయిలో నిర్మించాలని భావిస్తున్నాడు. దీంతో సుకుమార్ ప్రాజెక్టు కి అటెండ్ కాలేకపోతున్నాడట. ఫోకస్ తగ్గుతోందట. అయితే మెగా 151వ సినిమా షూటింగ్ ని ఓ పట్టాలెక్కించేంత వరకు చరణ్ ఇలానే ఉంటాడని తెలుస్తోంది.

అసలు రంగస్థలం సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని సుకుమార్ భావిస్తున్నాడు. సుకుమార్ కి ఆ పండగ అంటే చాలా సెంటిమెంట్. పోటీకి ఎన్ని సినిమాలు వచ్చినా హిట్ అవుతుందని భావిస్తున్నాడు. ఇంతకుముందు సంక్రాంతికి నాన్నకు ప్రేమతో సినిమాను పోటీ మధ్యలోనే రిలీజ్ చేసి సక్సెస్ ను అందుకున్నాడు. అందుకే ఇప్పుడు రంగస్థలం లేటవుతుంటే సుక్కూకి కోపం వస్తోందట. ఈ రూమర్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.