Begin typing your search above and press return to search.

సుకుమార్ కు హీటు తగిలిందా..?

By:  Tupaki Desk   |   7 April 2019 6:09 PM IST
సుకుమార్ కు హీటు తగిలిందా..?
X
పాత 'లవకుశ' సినిమాలోని పాటలో చెప్పినట్టు "ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు?".. ఎవరూ ఊహించలేరు. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇలాంటి సందిగ్దత నెలకొంటుందని ఎవరూ ఊహించి ఉండరు. మహేష్ బాబుతో అనుకున్న సినిమా కాస్తా పక్కకెళ్ళిపోయింది.. ఇప్పుడు బన్నీతో సినిమా లైన్లో ఉందనుకున్నా.. ఆ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

అయితే సుకుమార్ బన్నీకి రీసెంట్ గా ఒక కథను వినిపించాడట. కానీ ఈ కథ గురించి తెలిసిన బన్నీ ఫ్రెండ్ ఒకరు దీనికి మూలం అయిన హాలీవుడ్ సినిమా వివరాలను అందించడంతో పాటుగా ఆ సినిమా ఫ్లాప్ అయిన కారణం కూడా వివరించాడట. దీంతో బన్నీ ఈ కథ చేయలేనని.. మరో కథను తయారు చేయమని సుకుమార్ ను కోరాడట. దీంతో సుకుమార్ కథ మళ్ళీ మొదటికి వచ్చిందట. ప్రస్తుతం వేరే ఏ స్టార్ హీరో కూడా అందుబాటులో లేడు కాబట్టి బన్నీ కోసమే వేచి చూడకతప్పని పరిస్థితి ఉంది.

ఇతర హీరోలతో పోలిస్తే బన్నీని కథతో ఒప్పించడం మరింత కష్టమని అందరికీ తెలిసిందే. దానికి తోడు గీతా ఆర్ట్స్ లో స్క్రిప్ట్ అంతా పక్కాగా ఉంటేనే కానీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ రాదు. ఏదేమైనా సుకుమార్ కు హీట్ తగిలినట్టేనని అంటున్నారు.