Begin typing your search above and press return to search.
'ఆ గట్టున' ముందుంది దేవినే
By: Tupaki Desk | 1 April 2018 11:35 AM ISTరంగస్థలం సినిమా చూసాక ఆ పాటలను ఇష్టపడిన ప్రతి ఒక్కరికి కలిగిన అనుమానం సెకండ్ హాఫ్ లో వచ్చే 'ఆ గట్టునుంటావా' అనే పాటలో గొంతు మారిపోవడం. ఆ పాట పాడింది శివనాగులు అనే జానపద కళాకారుడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అతన్ని ప్రత్యేకంగా స్టేజి పైకి పిలిపించి దేవి గుర్తింపు ఇవ్వడమే కాక అక్కడికక్కడే పాడించాడు కూడా. ఈ సందర్భంగా శివనాగులు ఎమోషనల్ కూడా అయ్యాడు. కాని సినిమాలో మాత్రం ఆ పాటకు దేవి శ్రీ ప్రసాద్ గొంతు ఉండటం పట్ల అందరు షాక్ తిన్నారు. ఎందుకు మార్చారు ఎందుకు దేవి తిరిగి పాడాల్సి వచ్చింది అనే దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరిగాయి. కొందరు ఒక అడుగు ముందుకు వేసి శివనాగులు ప్రతిభను తొక్కేసారంటూ కామెంట్స్ కూడా చేసారు. దీని మీద ఎట్టకేలకు సుకుమార్ స్పందించాడు.
నిజానికి ఈ పాట రికార్డు చేసినప్పుడు పాడింది దేవి శ్రీ ప్రసాదేనట. షూటింగ్ లో కూడా అదే వాయిస్ తో షూట్ చేసారు. కాని శివనాగులు గురించి తెలిసాక అతనితో మరోసారి పాడించారు. అది బాగా అనిపించడంతో ఆల్బంలో అతని గొంతుతోనే విడుదల చేసారు. తీరా రీ రికార్డింగ్ చేసి ఫైనల్ కాపీ చూసుకున్నాక చరణ్ బాడీ లాంగ్వేజ్ కి శివ నాగులు వాయిస్ లోని పిచ్ బాగా డామినేట్ చేయటంతో రేపు థియేటర్లో డిజిటల్ సౌండ్ లో దీన్ని చూసే ప్రేక్షకులకు ఇబ్బంది కలగవచ్చనే అనుమానం కలిగింది. దీంతో మళ్ళి దేవి శ్రీ ప్రసాద్ పాడిన మొదటి ట్రాక్ నే తప్పనిసరి పరిస్థితుల్లో జత చేసారు. దాని వల్లే అలా జరిగింది తప్ప షూటింగ్ అయ్యాక పాటను మళ్ళి రికార్డింగ్ చేయలేదు.
సుకుమార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కన్విన్సింగ్ గానే ఉంది. పైగా తమకు శివనాగులు పాటను మార్చే ఉద్దేశం ఏ మాత్రం లేదని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని అందరి అభిప్రాయలు తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నాం తప్ప శివనాగులుపై తమ గౌరవం అలాగే ఉందని సుకుమార్ క్లారిటీ ఇచ్చేసాడు. సో ఆ గట్టున పాడింది మొదట దేవినే అనే క్లారిటీ వచ్చేసినట్టే. అవుట్ పుట్ కోసం కొన్ని సార్లు ఇలాంటివి చేయక తప్పదు.