Begin typing your search above and press return to search.

సుక్కుతో కన్నీళ్లు పెట్టించేశాడు

By:  Tupaki Desk   |   15 March 2018 4:11 AM GMT
సుక్కుతో కన్నీళ్లు పెట్టించేశాడు
X
ఓ సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ కీలకమే అయినా.. ఆయా సన్నివేశాలను తారాస్థాయికి తీసుకెళ్లిపోవడంలో సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓ మూవీ స్థాయిని మ్యూజిక్ పెంచేయగలదు. అలాగే తగ్గించేయగలదు కూడా. ప్రస్తుత జనరేషన్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ కు ఈ స్థాయి గుర్తింపు ఉంది. అసలు మనోడు మ్యూజిక్ అంటేనే.. ముందు సినిమాకు సగం హిట్ టాక్ వచ్చేస్తుంటుంది.

ఇక దేవిశ్రీ మనసు పెట్టి పని చేస్తే ఆయా సినిమాల ఔట్ పుట్ ఎలా ఉంటుందో పలు మార్లు చూశాం. ఇప్పుడు రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం మూవీకి డీఎస్పీ అద్భుతమైన ట్యూన్స్ కట్టాడని తెలుస్తూనే ఉంది. ఆడియోలో అన్ని పాటలను హిట్ చేయగల సత్తా ఉన్న ఈ కంపోజర్.. సినిమా మొత్తానికి ఇదే స్థాయి ఔట్ పుట్ ఇచ్చాడట. రీసెంట్ గా ఆయా సన్నివేశాలకు సంబంధించి రీ-రికార్డింగ్ పూర్తి అయిన తర్వాత ఔట్ పుట్ చూసుకుని.. దర్శకుడు సుకుమార్ కంటి వెంట నీటి కొలకులు చెమర్చాయట.

ఆ ఎమోషనల్ సీన్స్ ఆన్ స్క్రీన్ పై బాగుంటాయని తెలుసు కానీ.. మరీ ఇంత అద్భుతంగా కుదరడం అంటే ఆ క్రెడిట్ అంతా నీకే దక్కుతుందని నేరుగానే పొగిడేశాడట సుకుమార్. యాక్షన్ బ్లాక్స్ లో రాంచరణ్ కు ఇచ్చిన బీజీఎం.. ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్స్.. సమంతతో రాంచరణ్ రొమాన్స్.. ఇలా అనేక సూపర్బ్ సీన్స్ ను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయి.. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసేశాడట రాక్ స్టార్.