Begin typing your search above and press return to search.

మహేష్‌ ను మోసం చేశా-సుకుమార్

By:  Tupaki Desk   |   14 April 2018 5:00 AM IST
మహేష్‌ ను మోసం చేశా-సుకుమార్
X
మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ దర్శకుడిగా నాలుగు సినిమాల అనుభవమున్న సుకుమార్ ను నమ్మి ‘1 నేనొక్కడినే’ సినిమా చేశాడు. ఐతే ఆ నమ్మకాన్ని సుకుమార్ నిలబెట్టుకోలేకపోయాడు. అయితే ‘1 నేనొక్కడినే’ అంత పెద్ద డిజాస్టర్ అయింది కానీ.. అదేమీ చెత్త సినిమా అనిపించుకోలేదు. కొందరు ఆ చిత్రాన్ని ఒక క్లాసిక్ అని కూడా అంటారు. దాని గురించి గొప్పగా మాట్లాడతారు. అయినప్పటికీ తాను ఆ సినిమా విషయంలో చాలా రిగ్రెట్ అవుతానని అంటున్నాడు సుకుమార్. ‘1 నేనొక్కడినే’ సినిమాకు కచ్చితంగా బదులు తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు సుక్కు చెప్పాడు.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ తో మళ్లీ సినిమా చేస్తారా అంటే.. అవునని అన్నాడు సుకుమార్. ‘1 నేనొక్కిడినే’ లెక్క సరి చేయాలని.. నిజానికి మహేష్ బాబు గురించి ఆలోచించినా.. ఆయన్ని కలిసినా.. తనకు గిల్టీ ఫీలింగ్ ఉంటుందని సుక్కు చెప్పాడు. ఆయన తనను ఎంతో నమ్మాడని.. పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని.. కానీ ఆయన నమ్మకాన్ని తాను నిలబెట్టుకోలేకపోయానని అన్నాడు సుక్కు. మహేష్ ను తాను మోసం చేసిన భావన తనలో ఉందని సుక్కు తెలిపాడు. కాబట్టి కచ్చితంగా మహేష్ తో మళ్లీ సినిమా చేసి హిట్టివ్వాలని అనుకుంటున్నానని చెప్పాడు. మరి సినిమా ఎఫ్పుడు అని అడిగితే.. ‘అతి త్వరలో’ అని బదులిచ్చాడు సుక్కు. ప్రభాస్ తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారటగా అని అడిగితే.. అది నిజమే కానీ ఇంకా ఏదీ ఖరారవ్వలేదని.. ఓకే అయ్యాక చెబుతానని సుకుమార్ క్లారిటీ ఇచ్చాడు.