Begin typing your search above and press return to search.
పుష్ప లో చంద్రబాబు.. జక్కన్న ను మించిన సుకుమార్
By: Tupaki Desk | 9 Jan 2022 6:00 PM ISTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి తన ప్రతి సినిమాను కూడా ఏళ్లకు ఏళ్లు తీస్తాడనే విమర్శ ఉంది. అయితే అదే సమయంలో ఆయన సినిమాలో ప్రతి ఎలిమెంట్ కూడా కథలో భాగం అయ్యి ఉంటుంది.. సెట్ లో కనిపించే ప్రతి ఒక్క వస్తువు కూడా కథ చెబుతూ ఉంటుంది. అంటే ఏ ఒక్క విషయంలో కూడా డిటైల్స్ ను మిస్ అవ్వకుండా జక్కన్న ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న జూనియర్ ఆర్టిస్టుల హెయిర్ స్టైల్ ను మరియు వారి మొహ కవలికలను కూడా పట్టించుకుని జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే ఆయన జక్కన్న.. ఆయన సినిమాలు అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి.. అంతగా జాగ్రత్తలు తీసుకుంటాడు కనుకే ఆయన సినిమాలు అంత లేట్ అవుతాయి. ఇప్పుడు రాజమౌళి కి ఏమాత్రం తక్కువ కాదని సుకుమార్ కూడా తన గత చిత్రం రంగస్థలం మరియు ఇప్పుడు పుష్ప తో నిరూపించుకున్నాడు.
సుకుమార్ పుష్ప సినిమా ను అద్భుతంగా తెరకెక్కించాడు. పుష్ప లోని ప్రతి సన్నివేశం కూడా చాలా నాచురాలిటీ ఉంటుంది. ప్రతి సీన్ లో కూడా పాత్రలను మరియు పరిసరాలను సహజ సిద్దంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. పీరియాడిక్ సినిమా అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా అప్పటి కాలం కు తగ్గట్లుగా చూపించాలి. కొన్నింటి విషయంలో పెద్దగా మార్పు లేదు కనుక లైట్ తీసుకోవచ్చు. కాని స్వల్పంగా మార్పు వచ్చిన వస్తువులు మరియు పరిసరాలను కూడా సుకుమార్ వదిలి పెట్టలేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా లోతుగా ఆలోచించి.. చాలా పరిశీలించిన తర్వాత షూటింగ్ కు వెళ్లారు. ఈ సినిమా కథ 1990 ల్లో జరిగినట్లుగా చూపించడం జరిగింది. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేశాడు.
ప్రభుత్వ ఆఫీస్ ల్లో అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా సీఎం.. పీఎం.. రాష్ట్రపతి ఫొటోలు మరియు ప్రముఖ దేశ భక్తుల ఫొటోలు ఉంటాయి. ఆ విషయం గురించి ఎక్కువగా పుష్ప లో చూపించలేదు. కాని ఆ డిటైల్స్ ను ఎక్కడ కూడా జక్కన్న మిస్ అవ్వలేదు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు ఫొటో అది కూడా అప్పటి చంద్రబాబు నాయుడు ఫొటోను ఉంచారు.
ప్రతి విషయంలో కూడా సుకుమార్ ఇలా డిటైల్స్ ను మిస్ అవ్వకపోవడం వల్లే సినిమా ఇంత అద్బుతంగా వచ్చింది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా భారీగా వసూళ్లు నమోదు అయ్యి 2021 బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో 75 కోట్లకు పైగా వసూళ్లు చేసిన పుష్ప ఓవరాల్ గా 300 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది. అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ఈ సినిమాను ఇంకా థియేటర్ లో జనాలు చూస్తూనే ఉన్నారు.