Begin typing your search above and press return to search.

సుక్కు అప్పుడే డ్యాన్సులేసేస్తున్నాడు

By:  Tupaki Desk   |   27 Feb 2018 11:29 AM GMT
సుక్కు అప్పుడే డ్యాన్సులేసేస్తున్నాడు
X
ఓ సినిమా మీద మేకర్ కి ఎంత కాన్ఫిడెంట్ ఉంటుందో.. ఆ సినిమా రిలీజ్ కి ముందు వారి బిహేవియర్ చెప్పేస్తుంటుంది. ప్రతీవాళ్లూ తమ సినిమా గురించి గొప్పగానే చెప్పుకున్నా.. కంటెంట్ మీద ఉండే నమ్మకం వారి బాడీ లాంగ్వేజ్ లోనే తెలిసిపోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని.. రిలీజ్ కి రెడీ అవుతున్న రామ్ చరణ్ మూవీ రంగస్థలం.

సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. టాలీవుడ్ లో ఇదో వెర్సటైల్ మూవీగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ విషయంలో ఏ ఒక్కరికీ చిన్నపాటి డౌట్ కూడా రావడం లేదంటే.. ఇప్పటివరకూ ఇచ్చిన పబ్లిసిటీ మెటీరియల్ అందుకు కారణంగా చెప్పవచ్చు. మరోవైపు దర్శకుడు కూడా యమా నమ్మకంగా ఉన్నాడు. టీంతో పాటే తాను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫైట్ మాస్టర్స్ తో కలిసి సందడి చేసిన వీడియోను గతంలో రివీల్ చేయగా.. ఇప్పుడు ఎంత సక్కగున్నావే పాటు సుకుమార్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. షార్ట్ ధరించి.. షూ వేసుకుని నది ఒడ్డున సుకుమార్ డ్యాన్స్ చేస్తుంటే.. ఆ లుక్కే వేరుగా ఉంది.

దర్శకుడే ఈ రేంజులో డ్యాన్స్ కుమ్మేస్తే.. ఇక మా హీరో ఎంతగా డ్యాన్స్ చేయనున్నాడో అంటూ మెగా ఫ్యాన్స్ మహా హుషారుగా ఉన్నారు. సినిమా రిలీజ్ కు నెల్లాళ్లు ముందు దర్శకుడే డ్యాన్సులు మొదలుపెట్టేస్తే.. ఇక ఫ్యాన్స్ సంగతి వేరే చెప్పాలా?