Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్‌ : జక్కన్నపై సుకుమార్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌

By:  Tupaki Desk   |   26 March 2022 6:28 AM IST
ఆర్ఆర్ఆర్‌ : జక్కన్నపై సుకుమార్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌
X
మీరు ప‌క్క‌నే ఉన్నా మిమ్మ‌ల్ని అందుకోవాలంటే ప‌రిగెత్తాలి-
మేం ఆకాశంలో ఉన్నా మిమ్మ‌ల్ని చూడాలంటే త‌లెత్తాలి-
రాజ‌మౌళి సార్,
మీకూ మాకూ ఒక‌టే తేడా..
ఇలాంటి సినిమాలు మీరు తీయ‌గ‌ల‌రు మేం చూడ‌గ‌లం అంతే-

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా దర్శకుడు రాజమౌళి ని ఉద్దేశించి పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి వంటి విజువల్ వండర్‌ ను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి మళ్లీ ఆ స్థాయి విజువల్ వండర్‌ ను అందించేందుకు చాలా కష్టపడ్డాడు.

అద్బుతాలు ఆవిష్కరించడం అందరి వల్ల కాదు. ఒక్క సారి అద్బుతం సృష్టించడం సాధ్యం అవుతుంది... కాని మళ్లీ మళ్లీ రాజమౌళి నుండి అద్భుతాలు వస్తూనే ఉన్నాయి. ఆ అద్భుతాలను కేవలం రాజమౌళి మాత్రమే చిత్రీకరించగలడు అని ప్రతి సినిమా చెప్పకనే చెబుతుంది. అందుకే దర్శకుడు సుకుమార్‌ అన్నట్లుగా ఇలాంటి సినిమాలు కేవలం రాజమౌళి మాత్రమే తీయగలరు.. మనం చూడగలం అనడంలో సందేహం లేదు.

రాజమౌళి మన ఇండస్ట్రీలో.. మన పక్కనే.. మన కళ్ల ముందే ఉన్నట్లుగా అనిపించినా కూడా ఖచ్చితంగా ఆయనది ఎక్కడో ఉన్న హాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ రేంజ్ అనడంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఆయన గొప్ప దర్శకుడు అనే మాటలో సందేహం లేదు. ప్రతి ఒక్క సినిమా తో ప్రపంచం ను తన వైపు తిప్పుకుంటున్న దర్శకుడు కనుక రాజమౌళిని మనం చూడాలంటే తల ఎత్తుకోవాల్సిందే.

రాజమౌళిని పట్టుకోవాలంటే పరిగెత్తడం కాదు.. జెట్‌ స్పీడ్ రైల్లో వెళ్లినా సాధ్యం కాదు. ఆయన స్థాయి వేరు అంటూ మరో సారి ఈ సినిమా తో నిరూపితం అయ్యింది. ఆర్ ఆర్‌ ఆర్ సినిమా లో ఇద్దరు హీరోలను చాలా బ్యాలన్స్ తో.. అద్బుతమైన ఎమోషన్స్ తో చూపించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. వందల కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం లో ఎలాంటి డౌట్ లేదు.