Begin typing your search above and press return to search.

సుకుమార్‌ తన బ్రాండ్‌ ను బాగా వాడేస్తున్నాడు

By:  Tupaki Desk   |   2 Feb 2019 10:27 PM IST
సుకుమార్‌ తన బ్రాండ్‌ ను బాగా వాడేస్తున్నాడు
X
ఈమద్య కాలంలో హీరోలు - హీరోయిన్స్‌ - దర్శకులు ఇలా అంతా కూడా తమ స్టార్‌ డంను వాడేసుకుంటూ మరో చేత్తో సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోలు - హీరోయిన్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్స్‌ గా మారడం - వ్యాపారాలు ప్రారంభించడం చేస్తూ ఉన్నారు. ఎవరికి తోచినట్లుగా వారు వారి బ్రాండ్స్‌ ను వాడేసుకుంటున్నారు. ఒకప్పుడు సినీ స్టార్స్‌ తో పోల్చితే ఇప్పుడు సెలబ్రెటీలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా అందుకు భిన్నం ఏమీ కాదు. టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ గా తనకు ఉన్న బ్రాండ్‌ ను సుకుమార్‌ ఫుల్‌ గా వాడేసుకుంటున్నాడు.

ఒక వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరో వైపు చిన్న సినిమాలను నిర్మించేందుకు ముందుకు వస్తున్నాడు. పెద్దగా పెట్టుబడి పెట్టకుండా ఇతర నిర్మాతలతో చేతులు కలిపి తన బ్రాండ్‌ తో సినిమాకు మంచి క్రేజ్‌ తీసుకు రావడంతో ఆయా సినిమాలకు మంచి బిజినెస్‌ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మైత్రి మూవీస్‌ వారితో కలిసి మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ తో ఒక సినిమాను నిర్మిస్తున్న సుకుమార్‌ తాజాగా శరత్‌ మారార్‌ తో కలిసి ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యాడు. తన బ్రాండ్ ను వాడేసుకుంటూ వరుసగా సుకుమార్ సినిమాలను నిర్మిస్తున్నాడు.

సుకుమార్‌ రైటింగ్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ కలయికలో నాగశౌర్య హీరోగా కాశీ విశాల్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. తాజాగా సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వ శాఖలో పలు సినిమాలకు వర్క్‌ చేసిన కాశీ విశాల్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. సుకుమార్‌ ఆధ్వర్యంలో స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హీరోయిన్‌ మరియు ఇతర విషయాలను త్వరలోనే వెళ్లడిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.