Begin typing your search above and press return to search.

తమిళనాడులో చెర్రీ గోదారి గట్లు

By:  Tupaki Desk   |   22 Dec 2016 5:00 PM IST
తమిళనాడులో చెర్రీ  గోదారి గట్లు
X
ధృవ సక్సెస్ ను ఎంజాయ్ చేయడంతో పాటు.. మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్న చెర్రీ.. జనవరి నెలాఖరు కల్లా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించనున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ అంతా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని ఇప్పటికే చెప్పేశారు.

షూటింగ్ చేసేందుకు తగిన లొకేషన్స్ కోసం రీసెంట్ గా గోదారి జిల్లాలను చుట్టి వచ్చారు దర్శకుడు సుకుమార్.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. అయితే.. గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగ్ చేయడం అసాధ్యం అని ఫిక్స్ అయిపోయి.. లొకేషన్ ని తమిళనాడుకు మార్చేశారట. అక్కడ పొలాచ్చిలో సుక్కు-చెర్రీల సినిమా షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. దాదాపు సినిమా అంతా అక్కడే పిక్చరైజ్ చేయనున్నారట. గోదావరి జిల్లాల్లో మెగా ఫ్యాన్స్ బాగా ఎక్కువ కావడమే.. ఇలా తమిళనాడు ప్రయాణం పెట్టుకోవడానికి కారణంగా తెలుస్తోంది.

తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాలు మెగాహీరోలకు స్ట్రాంగ్ జోన్. అక్కడ షూటింగ్ చేస్తే.. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం అసాధ్యం అని ఫిక్స్ అయిపోయాడట సుకుమార్. సెక్యూరిటీతో ఎలాగోలా స్టార్ట్ చేసినా.. అనుకున్న టైంకి కంప్లీట్ చేయడం కష్టమవుతుందని.. అందుకు బదులుగా.. గోదావరి జిల్లాలను తలపించే పొల్లాచ్చిలోనే షూటింగ్ చేసేయాలని నిర్ణయించుకున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/