Begin typing your search above and press return to search.

క్రియేటివ్‌ గిఫ్టుతో సుక్కూ అదరగొట్టాడు

By:  Tupaki Desk   |   20 May 2016 7:06 PM IST
క్రియేటివ్‌ గిఫ్టుతో సుక్కూ అదరగొట్టాడు
X
మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. మరి బర్త్ డే అంటే బహుమతులు కామన్. అందుకునే వారి స్టేటస్ మాత్రమే కాదు.. బహుమతుల్లో ఇచ్చేవారి మేథస్సు కూడా కనిపిస్తుంది. గిఫ్టుల్లో తెలివితేటలు చూపించడం అంటే ఏంటా అనుకుంటున్నారా? అదేంటో తెలియాలంటే ఎన్టీఆర్ కి లెక్కల మాస్టారు సుకుమార్ ఇచ్చిన గిఫ్ట్ గురించి తెలుసుకోవాల్సిందే.

"నా పుట్టిన రోజుకు నేను అందుకున్న బహుమతుల్లో అపూర్వమైన గిఫ్ట్ ఇదే. థ్యాంక్స్ టు సుకుమార్ గారు" అంటూ ట్వీట్ చేసిన జూనియర్.. ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. సాధారణ జనాలకైతే చూడ్డానికి అదో వాల్ క్లాక్ మాత్రమే. కానీ అందులో ఉన్న కాన్సెప్ట్స్ ని పరిశీలిస్తే మైండ్ బ్లాంక్ అవక తప్పదు. పై భాగంలో 'టు డాడ్ - విత్ లవ్' అన్న లైన్.. వీరిద్దరి మధ్య వచ్చిన నాన్నకు ప్రేమతో అని తెలుస్తూనే ఉంది.

ఆ సినిమాలో కీలకంగా ఉండే బటర్ ఫ్లైస్.. వాల్ క్లాక్ లోనూ కనిపిస్తాయి. ఫాలో - ఫాలో టైం.. అనే క్యాప్షన్.. హీరోయిన్ రకుల్ తో లవ్ స్టోరీని గుర్తు చేస్తుంది. గేమ్ ఓవర్ అని రాసి అక్కడ ప్లేస్ చిన రెండు బాల్స్ ని చూడగానే.. విలన్ ఆడే మైండ్ గేమ్ గుర్తొస్తుంది. ఏమైనా ఒక్క వాల్ క్లాక్ లో ఇన్ని కాన్సెప్టులా? సుకుమార్ మేథస్సును అర్ధం చేసుకోవాలంటే జనాలకు చాలానే టైం పట్టేట్లుంది. ఏదేమైనా అదరగొట్టేశాడు కదూ.