Begin typing your search above and press return to search.

నిఖిల్ లోని ఆ 18 పేజీలు హార్ట్ ట‌చింగేనా?

By:  Tupaki Desk   |   5 March 2020 4:24 AM GMT
నిఖిల్ లోని ఆ 18 పేజీలు హార్ట్ ట‌చింగేనా?
X
నిఖిల్ సిద్ధార్థ్ క‌థానాయ‌కుడిగా కుమారి 21 ఎఫ్ ఫేం ప‌ల్నాటి ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో జీఏ2- సుక్కూ రైటింగ్స్ సినిమా నేటి (గురువారం) ఉద‌యం ప్రారంభ‌మైంది. ఇది సుక్కూ బ్రాండ్ సినిమా. నిఖిల్ కెరీర్ లో మ‌రో క్రేజీ మూవీ అనే చెప్పొచ్చు. నేటి ప్రారంభోత్స‌వంలోనే సినిమా టైటిల్ ని ప్ర‌క‌టించారు. ఒక‌రోజు ముందే ఈ సినిమా టైటిల్ ని తుపాకి ఎక్స్ క్లూజివ్ గా రివీల్ చేసిన‌ సంగ‌తి తెలిసిందే.

తాజాగా 18 పేజెస్ టైటిల్ లోగో రివీలైంది. టైటిల్ కాన్సెప్టుకు త‌గ్గ‌ట్టే లోగోని అంతే ఇంట్రెస్టింగ్ గా ఒక నోట్ బుక్ సింగిల్ రూళ్ల‌ పూజీపై డిజైన్ చేశారు. 18 అనేది టైటిల్ గా కాగా.. పేజెస్ అనేది ఉప‌శీర్షిక‌గా క‌నిపిస్తోంది. గులాబీ .. వంద నోటు- వాట్సాప్ సందేశాలు- పాళీ.. వాచ్ గిఫ్ట్.. ఇవ‌న్నీ చూస్తుంటే ప్రేమికుల పేజీల్లో తీపి జ్ఞాప‌కాలేన‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఈ చిత్రానికి సుకుమార్ క‌థ‌- స్క్రీన్ ప్లే అందించారు. ఈ టైటిల్ సుక్కూ బ్రాండులా.. జీఏ 2 బ్రాండ్ ల‌వ్ స్టోరీ తో కుర్ర‌కారులోకి దూసుకెళ్ల‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. టైటిల్ తోనే ఒక‌ ర‌కంగా పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింద‌నే అర్థ‌మ‌వుతోంది. టైటిల్ లోగోని బ‌ట్టి ఇది కూడా ఓ స్కూల్ కాలేజ్ డేస్ ల‌వ్ స్టోరీనా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఇక వివిధ ద‌శ‌ల్లో ఈ ప్రేమ‌ క‌థ‌ను ఆవిష్క‌రించ‌నున్నారా? అన్న గెస్ చేయొచ్చు.

100 ప‌ర్సంట్ ల‌వ్ - గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన జీఏ2 తో క‌లిసి సుకుమార్ రైటింగ్స్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించిన ప్ర‌తాప్ ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకునేందుకు మ‌రో స‌ద‌వ‌కాశ‌మ‌నే చెప్పాలి. ఇక యంగ్ ట్యాలెంటెడ్ నిఖిల్ కి కెరీర్ ప‌రంగా మ‌రో ఎన‌ర్జీ బూస్ట‌ర్ ఈ సినిమా అవుతుంద‌నే భావించాల్సి ఉంటుంది.