Begin typing your search above and press return to search.

యువ హీరోతో సినిమా అనౌన్స్ చేసిన సుకుమార్..!

By:  Tupaki Desk   |   12 March 2021 5:30 AM GMT
యువ హీరోతో సినిమా అనౌన్స్ చేసిన సుకుమార్..!
X
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రొడక్షన్ లో 'Rx100' ఫేమ్ కార్తికేయ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందని నిన్న 'తుపాకీ డాట్ కామ్' వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఈరోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కార్తికేయ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సుక్కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

కాగా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఇటీవలే ''ఉప్పెన'' వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీఏ 2 పిక్చర్స్ భాగస్వామ్యంలో బన్నీ వాసుతో కలిసి సుకుమార్ '18 పేజెస్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలానే సాయి ధరమ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ తో కలిసి సుకుమార్ ఓ మిస్టికల్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు 'చావు కబురు చల్లగా' సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్న కార్తికేయతో ఓ సినిమా ప్రకటించాడు. ఏదేమైనా సుకుమార్ ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పవచ్చు.