Begin typing your search above and press return to search.

పూరి గుహలో సుక్కు పాగా!

By:  Tupaki Desk   |   5 Nov 2018 6:39 AM GMT
పూరి గుహలో సుక్కు పాగా!
X
జయాపజయాలు పక్కన పెడితే దర్శకుడు పూరి జగన్నాధ్ ను ప్రత్యేకంగా అభిమానించే వాళ్ళలో ప్రేక్షకులతో పాటు సినిమా దర్శకులు హీరోలు కూడా ఉన్నారు. గత మూడు నాలుగేళ్లుగా తన స్థాయి సక్సెస్ ను అందుకోలేక ఇబ్బంది పడుతున్న పూరి కొత్త సినిమా స్క్రిప్ట్ కోసం బాగా కష్టపడుతున్నాడు. కొత్త వాళ్ళతో ఉంటుందా లేక ఆకాష్ పూరితో చేస్తాడా అనే క్లారిటీ ఇంకా లేదు కానీ తన ఆఫీస్ పూరి కేవ్ లో దీనికి సంబందించిన కథా చర్చలు మాత్రం రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి.

నిజానికి ఇప్పుడున్న దర్శకులందరి ఆఫీసులోకి పూరిది చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అద్భుతమైన ఇంటీరియర్స్ తో ఒక్కసారి లోపలి వెళ్తే బయటికి రావడానికి అంతగా ఇష్టపడనంత గొప్పగా అక్కడి వాతావరణం కట్టిపడేస్తుంది. అందుకే వీక్ఎండ్స్ పూరి ఫ్రెండ్స్ దీన్నో అడ్డాగా మార్చుకుని సినిమా కాలక్షేపం చేస్తుంటారు.

తాజాగా సుకుమార్ పూరి కేవ్ కు అతిధిగా మారాడు. ఒక్కడే కాదు హీరో శ్రీకాంత్ అల్లరి నరేష్ తరుణ్ లతో పాటు ఛార్మీ కూడా వీళ్ళతో సందడి చేస్తూ కనిపించింది. కారణం కాజువల్ మీట్ కావొచ్చు. సరదాగా సమయం గడుపుతూ అందరు కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మెహబూబా తర్వాత పూరి సినిమాకు సంబందించిన అప్ డేట్స్ ఇంకా బయటికి చెప్పడం లేదు. సుకుమార్ తో తన కొత్త సబ్జెక్టు విశేషాలు ఏమైనా పూరి షేర్ చేసుకున్నాడో ఏమో వాళ్ళిద్దరికే తెలుసు. కేవ్ లో అల్లరి నరేష్ ని చూస్తే అమెరికా షెడ్యూల్ కోసం మహర్షిలో లేనట్టు క్లారిటీ వచ్చేసింది. ఇక చాలా రోజుల తర్వాత తరుణ్ కనిపించడం విశేషం