Begin typing your search above and press return to search.
AA-20 లాంచింగ్ ఎప్పుడంటే?
By: Tupaki Desk | 5 Sept 2019 4:08 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ క్రేజీ మూవీ AA20 ప్రారంభోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు చిత్రయూనిట్ నుంచి సరైన సమాధానం లేదు. `రంగస్థలం` లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుక్కూ లాంటి స్టార్ డైరెక్టర్ ఇంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది. అయితే వెయిట్ చేసినా అతడు ఎలాంటి సినిమా చేయబోతున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది.
`రంగస్థలం` విడుదలై ఇప్పటికే సంవత్సరం అయ్యింది. అయితే ఏడాది పాటు మహేష్ స్క్రిప్టు కోసం ఎంతో శ్రమించిన సుకుమార్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆశించిన ప్రాజెక్ట్ చేయలేకపోయిన సంగతి తెలిసిందే. అందుకే సుకుమార్ తన తదుపరి చిత్రం షూటింగ్ ఆలస్యమైంది. బన్ని కోసం ఇప్పటికే కథను రెడీ చేశాడు. ఎర్రచందనం స్మగ్లర్ల బ్యాక్ డ్రాప్ కథాంశాన్ని ఎంచుకుని ఇప్పటికే లొకేషన్ల వేట సాగించాడని వార్తలొచ్చాయి.
అలాగే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 3 న హైదరాబాద్ లో అధికారికంగా ప్రారంభమవుతుంది. అదే నెల 15 నుంచి నెలాఖరు వరకూ తొలి షెడ్యూల్ కొనసాగిస్తారు. సుక్కూతో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత తిరిగి బన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలోని `అల వైకుంటపురంలో` సెట్స్ కు వెళతాడు. సుకుమార్ కొంత విరామం తీసుకుని.. తిరిగి జనవరి నుండి విరామం లేకుండా బన్నితో సినిమాని పూర్తి చేస్తాడని తెలిసింది. త్రివిక్రమ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకన్` (AA21)కూడా క్యూలో ఉంది కాబట్టి సుక్కూతో సినిమాని ప్యారలల్ గా ప్లాన్ చేస్తాడా? అన్నది చూడాలి.