Begin typing your search above and press return to search.

సుక్కూ... చూస్కో మ‌రి!

By:  Tupaki Desk   |   21 Jan 2016 1:00 PM IST
సుక్కూ... చూస్కో మ‌రి!
X
సినిమా ఎంత షార్ట్‌ గా ఉంటే అంత మేల‌ని న‌మ్ముతుంటారు చాలామంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఇప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ సేపు థియేట‌ర్ లో కూర్చునే ఓపిక‌లు లేవ‌నేది వారి అభిప్రాయం. అందుకే కోట్లు పెట్టి తీసిన సన్నివేశాల్ని సైతం ఒక్కోసారి ప‌క్క‌న పెట్టేస్తుంటారు. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ట‌.

సుకుమార్ ఎంతో ఇష్టంగా తీసిన కొన్ని స‌న్నివేశాల్ని ప‌క్క‌నపెట్టేశాడ‌ట‌. నిడివి మ‌రీ ఎక్కువ‌వుతుంద‌నే అలా చేశారు. అయినా సినిమా రెండుగంట‌ల న‌ల‌భై నిమిషాల‌కు పైగానే సాగుతుంది. మిక్స్‌ డ్ రెస్పాన్స్‌ తో న‌డుస్తున్న ఆ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్ని క‌ట్ చేయొచ్చేమో అని ప్ర‌చారం సాగింది. కానీ అది జ‌ర‌గ‌క‌పోగా ఇప్పుడు మ‌రో సీన్‌ ని కూడా యాడ్ చేస్తున్నార‌ట‌. సుకుమార్ ఇటీవ‌ల విలేక‌ర్ల‌తో ఆ విష‌యాన్ని చెప్పుకొచ్చాడు. అయితే క‌ట్ చేసిన ఆ స‌న్నివేశంలో కూడా ఎన్టీఆర్ ఉండ‌డ‌ట‌. జ‌గ‌ప‌తిబాబుపైనే ఆ స‌న్నివేశాలు సాగుతాయ‌ట‌. కానీ అవి ప్రేక్ష‌కుల‌కు కిక్కిచ్చేలా ఉంటాయ‌ని, దాంతో సినిమాకి మ‌రింత ప‌రిపూర్ణం ల‌భించిన‌ట్టు అవుతుంద‌ని సుకుమార్ చెబుతున్నాడు. కానీ నిడివి మ‌రీ పెరిగిపోతుందేమో ఒక‌సారి సుకుమార్ ఆలోచించాలి.

నాన్న‌కు ప్రేమ‌తో చూసిన‌వాళ్లంతా లెక్క‌ల సినిమా ఇది అంటున్నారు. సుక్కు లెక్క‌లు భ‌లే ఉన్నాయ‌ని చెబుతున్నారు. అయితే ఆయ‌న మాత్రం నేను లెక్క‌ల‌కంటే మ‌న‌సుకే ప్రాధాన్య‌మిస్తాన‌ని, ఆ కోణంలో ఆలోచించే సినిమా తీస్తాన‌ని చెప్పుకొచ్చాడు. సినిమాకి ల‌భిస్తున్న స్పంద‌న ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా త‌ర్వాత మా చుట్టు ప‌క్క‌ల ఊళ్ల నుంచి నాకు ఫోన్లు వ‌చ్చాయ‌ని చెప్పుకొచ్చాడు సుక్కు.