Begin typing your search above and press return to search.

సుక్కు తర్వాత చిరు ఓ చూపు చూస్తారట!

By:  Tupaki Desk   |   4 Jun 2020 4:00 PM IST
సుక్కు తర్వాత చిరు ఓ చూపు చూస్తారట!
X
మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరోగా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సుకుమార్ టీమ్ లో పని చేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై సంయక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2 తారీఖున విడుదల కావాలి కానీ థియేటర్లు మూతపడడంతో వాయిదా పడింది.

త్వరలోనే థియేటర్లు ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాను రెడీ చేస్తున్నారట. ఈ సినిమా అవుట్ పుట్ టోటల్ గా నాలుగు గంటలు వచ్చిందట. దీంతో ఇప్పటికే సుకుమార్ తన వైపు నుండి కొన్ని కట్స్ సూచించారట. అనవసరమైన సీన్లను.. అలాగే ఎక్కువ ల్యాగ్ అవుతుంది అనిపించే సీన్లను కట్ చేయమని చెప్పారట. ఇదంతా పూర్తయిన తర్వాత సినిమాను మెగాస్టార్ చిరంజీవికి చూపిస్తారని.. ఒకవేళ ఆయన ఏవైనా సూచనలు ఇస్తే వాటిని పాటిస్తారని అంటున్నారు. మెగా ఫ్యామిలీ లో కొత్త హీరోలు పరిచయం అయ్యే సమయంలో దాదాపుగా ఆ సినిమాకు మెగాస్టార్ టచ్ ఇవ్వడం సాధారణమేనని అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో అదే ఫాలో అవ్వబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియులను అలరించాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేస్తాడని కూడా అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.